జేఈఈ మెయిన్‌లో తొలగించిన సిలబస్‌ నుంచి ప్రశ్నలు

జేఈఈ మెయిన్‌లో ప్రశ్నపత్రాల్లో తొలగించిన సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Updated : 31 Jan 2024 07:12 IST

ప్రశ్నపత్రాల తీరుపై విద్యార్థుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లో ప్రశ్నపత్రాల్లో తొలగించిన సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 29వ తేదీన రెండు మూడు ప్రశ్నలు తొలగించిన పాఠ్యాంశాల నుంచి రాగా...మంగళవారం జరిగిన రెండు విడతల్లో ఒక్కో దాంట్లో మూడు నాలుగు వచ్చాయని నిపుణులు తెలిపారు. ఆ తొలగించిన సిలబస్‌ మాత్రం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉంటుంది. అందువల్ల అడ్వాన్స్‌డ్‌ లక్ష్యంగా సిద్ధమయ్యే వారు మాత్రం తీసేసిన పాఠ్యాంశాలను కూడా చదువుతారని, వారికి ఇబ్బంది లేకున్నా మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రంలో ఎక్కువగా ఇస్తున్నారని జేఈఈ నిపుణులు ఉమాశంకర్‌, కృష్ణ చైతన్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని