ITR: 8 కోట్లు దాటిన ఐటీ రిటర్నులు..

Income Tax Returns filing: గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఐటీ శాఖ కొత్త మైలురాయిని చేరుకుంది.

Updated : 30 Dec 2023 15:53 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023-24 మదింపు సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను (ITR) రిటర్నులు దాఖలైనట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శుక్రవారం నాటికి 8 కోట్ల మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. 2022-23 మదింపు సంవత్సరంలో మొత్తం 7,51,60,817 రిటర్నులు దాఖలయ్యాయని అధికారిక ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించింది. దీంతో ఐటీశాఖ సరికొత్త మైలురాయిని చేరుకుందని వెల్లడించింది.

డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ కంటే.. దీర్ఘకాలిక పెట్టుబడులే మేలు

గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్ ఫైల్ చేయని వారు ‘బిలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఆఖరు తేదీ 2023, డిసెంబర్ 31. ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన వారు అందులో ఏవైనా తప్పులుంటే ఈ తేదీలోపు తిరిగి రివైజ్డ్‌ రిటర్న్ ఫైల్ చేసి సరిదిద్దుకోవచ్చు. తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్‌లో నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది. రివైజ్డ్‌ రిటర్నులు దాఖలు చేసేందుకు ఎలాంటి ఆలస్య రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు