Apple: తమిళనాడులోని ఐఫోన్ కేంద్రం ఫాక్స్‌కాన్‌ తాత్కాలిక మూసివేత

తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న తమ ఐఫోన్‌ తయారీ కేంద్రం ఫాక్స్‌కాన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది....

Updated : 29 Dec 2021 15:15 IST

ప్రమాణాల మెరుగుదల తర్వాత తిరిగి ప్రారంభం

దిల్లీ: తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ కేంద్రం ఫాక్స్‌కాన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. సంస్థలో ప్రమాణాలను మరింత పటిష్ఠం చేసి తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది. ఇటీవల ఈ కేంద్రం వెలుపల ఉన్న ఓ వసతిగృహంలో కల్తీ ఆహారం వల్ల పలువురు కార్మికులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో వారు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి ఈ కేంద్రాన్ని మూసివేశారు. డిసెంబరు 30 కల్లా తెరుస్తారని అంతా భావించారు. ఈ తరుణంలో యాపిల్‌ నుంచి తాజా ప్రకటన వెలువడడం గమనార్హం. 

ఈ కేంద్రంలోని స్థానిక యాజమాన్యాన్ని కూడా మారుస్తామని ఫాక్స్‌కాన్‌ ప్రకటించింది. తద్వారా ఉన్నత ప్రమాణాలను పాటించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఫ్యాక్టరీ తిరిగి తెరిచే వరకు కార్మికులు, ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లిస్తామని వెల్లడించింది. సంస్థ వెలుపల ఉన్న కొన్ని వసతి గృహాల్లో ప్రమాణాలు ఉన్నతంగా లేవని తెలిపింది. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని