BIG C Dussehra offers: బిగ్‌సి దసరా ఆఫర్లు!

మొబైల్‌ విక్రయశాలల సంస్థ బిగ్‌ సి దసరా పండగ సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. మొబైల్‌ కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌, వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేని సులభ...

Updated : 13 Oct 2021 08:39 IST

హైదరాబాద్‌: మొబైల్‌ విక్రయశాలల సంస్థ బిగ్‌ సి దసరా పండగ సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. మొబైల్‌ కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌, వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేని సులభ వాయిదాల్లో కొనుగోలు చేసే సౌలభ్యంతో పాటు బహుమతులు ఇస్తున్నట్లు సంస్థ సీఎండీ బాలు చౌదరి వెల్లడించారు. మొబైల్‌ కొనుగోళ్లపై బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా  రూ.3500 వరకు, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులతో రూ.1500 వరకు, అమెజాన్‌ పేతో రూ.3500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేటీఎం మాల్‌తో ఓపో మొబైల్‌ కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ఐఫోన్‌లపై రూ.6000 వరకు, శామ్‌సంగ్‌ మొబైళ్లపై రూ.10000 వరకు క్యాష్‌బ్యాక్‌, వన్‌ప్లస్‌ మొబైళ్లపై రూ.7000 వరకు రాయితీ, ఎంఐ మొబైళ్లపై రూ.3000 వరకు, వివో మొబైళ్లపై 10 శాతం, ఓపో మొబైళ్లపై రూ.4000 వరకు, స్మార్ట్‌టీవీలపై రూ.4500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని