పిల్లల ఉన్నత చదువుల కోసం....

పిల్లల ఉన్నత చ‌దువుల‌ను తల్లిదండ్రులు ఒక ఆర్ధిక లక్ష్యంగా చేసుకోవాలి....

Updated : 01 Jan 2021 17:27 IST

ప్రతి తలిదండ్రుల కోరిక తమ పిల్లలకు మంచి విద్యను సమకూర్చడం. దీనికోసం వారు చాలా కష్టపడి సంపాదించి, తమ ఖర్చులను కూడా తగ్గించుకుని పిల్లల భవిష్యత్ కోసం తపన పడుతూ ఉంటారు. అయినా చాలా కొద్ది మంది పిల్లలుమాత్రమే మంచి చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలలో రాణిస్తుంటారు. అధిక శాతం మంది చిరు ఉద్యోగాలకు పరిమితమై ఉంటారు. అంతంత మాత్రపు జీతాలతో జీవిస్తుంటారు. దీనికి ముఖ్యమైన కారణం నాణ్యమైన చదువు.
పిల్లలకు మంచి చదువు చెప్పించడం వలన, పిల్లల భవిష్యత్ తోపాటు తమ స్థాయిని కూడా పెంచుకోవచ్చు.

నాణ్యమైన చదువు ఉన్నత ప్రమాణాలను కలిగిఉంటుంది. చదివే సంస్థలో మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు, అర్హతగల ఉపాధ్యాయులు, ఉన్నత ప్రమాణాలను పాటించడం ద్వారా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాయి. దీనివలన వారు భవిష్యత్ లో పదిమందికి ఉపాధి కలిగించడం తో పాటు, మంచి వస్తు సేవలను అందించేవారుగా నిలబడతారు. అయితే ఇటువంటి నాణ్యమైన చదువుకు కొంత ఖర్చు అవుతుంది. అప్పటి వరకు సాధారణంగా చదివి, ఒక్కసారి ఉన్నత ప్రమాణాలను అందుకోవాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులకు లోనవుతారు. అందువలన మొదటి తరగతి నుంచి మంచి ప్రమాణాలు కలిగిన విద్యను పొందడం ద్వారా ఫై చదువులను సునాయాసంగా అందిపుచ్చుకోగలరు.

పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు దీనిని ఒక ఆర్ధిక లక్ష్యంగా చేసుకోవాలి. పిల్లలు చిన్న వయసు, అంటే పిల్లలు పుట్టిన నాటి నుంచే కొంత మొత్తం విడిగా మదుపు చేయాలి. పిల్లలు పుట్టిన నాటినుంచి వాళ్ళని బడిలో చేర్చడానికి కనీసం 3 ఏళ్ల సమయం ఉంటుంది కాబట్టి, ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలి. ఎటువంటి విద్యను అందించగలరు, ప్రస్తుత వార్షిక ఖర్చు ఎంత , విద్యకు సంబంధించి ద్రవ్యోల్బణం పరిగణించి భవిష్యత్ లో ఎంత ఉండబోతుంది , అప్పటికి అంత సొమ్ము కావాలంటే ఎటువంటి పథకాలను ఎంచుకోవాలి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఫీజు తోపాటు పుస్తకాలు, స్కూల్/ కాలేజ్ వారు నిర్వహించే వివిధ కార్యక్రమాలకు విద్యార్థుల పాల్గొనడం , వినోద విహార యాత్రలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వీటిద్వారా పిల్లలకు సామాజిక స్పృహ తోపాటు, బాధ్యత కూడా నేర్పవచ్చు.

ఉదా : ఈ కింది పట్టిక ద్వారా ఏ ఏడాదికి ఎంత సొమ్ము అవసరమో అంచనా వేయొచ్చు. వార్షిక ద్రవ్యోల్బణం 10 శాతం గా అంచనా వేసి తెలుసుకోవచ్చు.

EDN-EXP-1.png

లావణ్య, శేఖర్ లు తమ బాబుకు పదవ తరగతి వరకు కావలసిన సొమ్మును ప్రతి ఏడాది ఏర్పాటు చేయగలరు. . ఆ ఫై చదువులకు అధిక మొత్తాలు అవసరమవుతాయి కాబట్టి , వాటి గురించి ఈ కింది అంచనా వేసారు . ఇంటర్మీడియట్ మొదటి ఏడాదికి , ప్రస్తుత ఖర్చు రూ 50 వేలు ఉంటె , 10 ఏళ్ల తరువాత రూ 1.30 వేలు అంచనా వేసారు. అదే విధంగా మిగిలిన అన్ని ఏళ్లకు అంచనా వేసారు .
ఇప్పటి నుంచి 10 ఏళ్ల తరువాత రూ 17.50 లక్షలు ఉంటె, ప్రతి ఏడాదికి సరిపడ మొత్తాలను వినియోగించుకుని మిగిలిన సొమ్ముకు 8 శాతం వడ్డీ పొందుతుంటే , అన్ని ఏళ్లకు సరిపోతుందని అంచనా వేశారు.
ఈ సొమ్ము జమ చేయటానికి ఏ పధకాలు ఉన్నాయో చూద్దాము:
పీ పీ ఎఫ్: భద్రత, సగటున 8 శాతం నిర్దిష్టమైన వడ్డీ , ఐదు ఏళ్ల తరువాత ఏడాదికి ఒకసారి కొంత సొమ్ము ఉపసంహరించుకునే వీలు వంటి అనుకూలతలు .
అయితే దీర్ఘకాలం లో మదుపు చేసినప్పటికీ, మదుపుపై గరిష్ట పరిమితి, అధిక రాబడి పొందలేక పోవడం దీని ప్రతికూలత.
సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లలకోసం ప్రత్యేకించి రూపొందించిన పధకం. పైన తెలిపిన అనుకూలతలు, ప్రతికూలతలు వర్తిస్తాయి.
బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్: అయితే దీర్ఘకాలం లో మదుపు చేసినప్పటికీ, అధిక రాబడి పొందలేక పోవడం, వడ్డీ ఆదాయంపై పన్ను దీని ప్రతికూలతలు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ :దీర్ఘకాలం లో మంచి రాబడి (12 శాతం వరకు ) ఆశించవచ్చు. సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (SWP) ప్రతి ఏడాది అవసరమైన సొమ్మును పొందడం . ప్రభుత్వం ఈక్విటీ మార్కెట్ లలో మదుపు చేసేవారికి ప్రోత్సాహకాలు అందించటం వంటివి అనుకూలతలు.
స్వల్పకాలంలో ఈక్విటీ లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి - ఇది ప్రతికూలత.
10 ఏళ్లలో రూ.17.50 లక్షలు సమకూర్చుకోవాలంటే, 6 శాతం రాబడి అంచనాతో నెలకు రూ 10,625/-, 8 శాతం రాబడి అంచనాతో నెలకు రూ 9,500/-, 12 శాతం రాబడి అంచనాతో నెలకు రూ 7,500/- మదుపు చేయాల్సి వుంటుంది .

EDN-EXP-2.png

ముగింపు:
ఇది ఒక అవగాహనకు మాత్రమే. దీర్ఘ‌కాల పెట్టుబ‌డిలో చ‌క్ర‌వ‌డ్డీ కీల‌క పాత్ర పోషిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని