ప‌న్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ ఇప్పుడు మంచి ఆప్ష‌న్‌

మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నందున ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు ఇప్పుడు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి

Published : 18 Dec 2020 19:16 IST

2019-20 ఆర్థిక సంవత్సరానికి ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల‌ కోసం కాల వ్యవధి 2020 జూన్ 30 వరకు పొడిగించారు. అందువల్ల మీరు ఆలోచించడానికి సమయం ఉంది. ఇప్పుడు మీ 80 సి పెట్టుబడులు చేయవచ్చు. మీరు ఇప్పటికే పూర్తి చేసి ఉంటే, మీరు 2020-21 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడి పెట్టవచ్చు.

సెక్షన్ 80 సి ప్రయోజనాలకు అర్హత ఉన్న పెట్టుబడులు చాలా ఉన్నాయి, ఇవి ఇంతకు ముందే చర్చించబడ్డాయి. ఈ రోజు, మార్కెట్ పరిస్థితి భిన్నంగా ఉన్నందున, కొత్త కోణంలో చూడ‌వ‌చ్చు. మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నందును ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు ఇప్పుడు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి.

ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డులు
సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపులు ల‌భించే అనేక ప‌థ‌కాల‌లో ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డులు మెరుగైన‌వ‌ని చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఇత‌ర ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, పోస్టాఫీస్ ఉత్ప‌త్తులు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి చ్చిత‌మైన రాబ‌డి హామీనిచ్చేచ‌వి. ఇక యులిప్ ప‌థ‌కాలు బీమాతో పాటు మార్కెట్ ఆధారిత రాబ‌డిని ఇస్తాయి. ఒకే రాబ‌డికి క‌ట్టుబ‌డి ఉంటాయి. కానీ, ఈఎల్ఎస్ఎస్ ప‌న్ను మిన‌హాయింపుల‌తో పాటు మార్కెట్ల‌కు అనుగుణంగా లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

ప్ర‌స్తుత ప‌రిస్థితులు
ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ప‌డిపోతున్న నేప‌థ్యంలో ఏప్రిల్ 3, 2020 నాటికి ఈఎల్ఎస్ఎస్ మూడేళ్ల స‌గ‌టు రాబ‌డి ప్ర‌తికూలంగా ఏడాదికి -5.5 శాతంగా నమోదైంది. ఐదేళ్ల రాబ‌డిని లెక్కిస్తే ఏడాదికి -0.3 శాతంగా ఉంది. అయితే ప‌దేళ్ల‌కు మార్కెట్ల స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత రాబ‌డి ఏడాదికి స‌గ‌టుగా 6.88 శాతంగా ఉండొచ్చు.

మూడేళ్ల క్రితం ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌వారు కేవ‌లం ప‌న్ను మిన‌హాయింపులు మాత్ర‌మే పొందుతాడు. గ‌త ఐదేళ్ల నుంచి పెట్టుబ‌డులు పెడుతున్న‌వారి రాబ‌డి కూడా ప్ర‌తికూలంగానే ఉంది. అయితే ఈక్విటీల పెట్టుబ‌డుల‌కు మూడేళ్ల కాల‌ప‌రిమితి స‌రిపోదు. మూడేళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉన్న‌ప్ప‌టికీ ఈఎల్ఎస్ఎస్‌లో దీర్ఘ‌కాలం పెట్టుబ‌డుల‌కు మంచి రాబ‌డి ఆశించ‌వ‌చ్చు.

ఇప్పుడున్న మార్కెట్ల ప‌రిస్థితుల్లో రాబ‌డులు ప్ర‌తికూలంగా ఉంటాయి. ఇప్పుడు పెట్టుబ‌డులు చేస్తే వ‌చ్చే మూడేళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ కాలానికి మంచి రాబ‌డి ఉంటుంది. భ‌విష్య‌త్తు రాబ‌డికి, గ‌త రాబ‌డి సూచిక కాదు. ఈక్విటీల‌లో అనిశ్చితులు అనేవి స‌ర్వ‌సాధార‌ణం. ప‌న్నుఉ మిన‌హాయింపు, భ‌ద్ర‌త‌తో పాటు మంచి రాబ‌డి కావాలంటే ఈఎల్ఎస్ఎస్ ఒక్క‌టే మార్గం.

పీపీఎఫ్‌తో పోలిస్తే…
పీపీఎఫ్‌లో కూడా పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. పెట్టుబ‌డుల‌కు , వ‌డ్డీకి, మెచ్యూరిటీపై ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. ఈఎల్ఎస్ఎస్‌లో డివిడెండ్, క్యాపిట‌ల్ గెయిన్స్‌పై ప‌న్ను వ‌ర్తిస్తుంది. పీపీఎఫ్‌లో అటువంటిదేమీ లేదు. అంటే రిస్క్ లేదు. దీనిపై వ‌డ్డీని ప్ర‌భుత్వం త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తుంది. ఇందులో ఎటువంటి అనిశ్చితి ఏర్ప‌డదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే క‌చ్చితంగా అధి క రేట్లు ఉంటాయి. ప్ర‌స్తుతం ఏప్రిల్ 1, 2020 నుంచి పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.

చివ‌రిగా
మార్కెట్లు ఇప్పుడు న‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డుల‌కు మంచి స‌మ‌యం. మార్కెట్లు లాభ‌ప‌డిన‌ప్పుడు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. అయితే ఒకేసారి కాకుండా సిప్ రూపంలో పెట్ట‌డం మంచిది. అయితే క‌చ్చిత‌మై రాబ‌డి పొందాలంటే పీపీఎఫ్ వైపు చూడ‌వ‌చ్చు. ఇందులో ఏడాది గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉంది. ఇక ఈఎల్ఎస్‌లో కూడా ఏడాదికి సెక్ష‌న్ 80సి కింద రూ.1.5 ల‌క్ష‌ల‌కు ప‌న్ను మిన‌హాయిపులు ల‌భిస్తాయి. కానీ పెట్టుబ‌డుల‌కు ఎటువంటి గ‌రిష్ఠ ప‌రిమితి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని