ఎన్‌పీఎస్‌లో నాలుగు ర‌కాల యాన్యుటీ స్కీమ్‌లు

ఎన్‌పిఎస్ నుంచి నిష్క్రమించిన తర్వాత చందాదారులకు నెలవారీ పింఛను అందించే బాధ్యత ఎఎస్‌పిలదే

Published : 19 Jan 2021 12:24 IST

మీరు పదవీ విరమణ సమయంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) కింద మీ పెన్షన్ ఖాతా నుంచి నిష్క్రమించినప్పుడు లేదా మూసివేసినప్పుడు కార్పస్‌లో 60 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు, కాని తప్పనిసరిగా మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి.

ఎన్‌పిఎస్‌లో  యాన్యుటీ అంటే చందాదారుడు యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్ (ఎఎస్‌పి) నుంచి పొందిన నెలవారీ మొత్తాన్ని సూచిస్తుంది. పెన్షన్ మొత్తంలో ఎంత శాతం కేటాయించాల‌న్న‌ది స‌భ్యుని చేతిలో ఉంటుంది. చందాదారులు నిర్ణయించిన మొత్తంతో (వరుసగా 40 శాతం, సూపరన్యునేషన్  80 శాతం), ఎంపానెల్డ్ యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి యాన్యుటీ కొనుగోలు కోసం కేటాయిస్తారు.

ఎన్‌పిఎస్ నుంచి నిష్క్రమించిన తర్వాత చందాదారులకు నెలవారీ పింఛను అందించే బాధ్యత ఎఎస్‌పిలదే. ఈ ఏఎస్‌పీలు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) నియంత్రిత బీమా సంస్థలు, ఇవి ఎన్‌పీఎస్‌ చందాదారులకు యాన్యుటీ సేవలను అందించడానికి పీఎఫ్ఆర్‌డీఏ ఏర్పాటుచేస్తుంది.


మీరు ఎన్‌పిఎస్ నుంచి ఎప్పుడు నిష్క్రమించగలరు?
సూప‌ర్‌యాన్యుయేష‌న్‌:
మీరు అధిక వయస్సు / 60 ఏళ్లు దాటినప్పుడు,  నెలవారీ పెన్షన్‌ను అందించే యాన్యుటీని కొనుగోలు చేయడానికి కనీసం 40 శాతం పెన్షన్ కార్పస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. మిగిలిన నిధులను ఒకే మొత్తంగా ఉపసంహరించుకోవచ్చు.
ముందస్తు  నిష్క్రమణ:
ముంద‌స్తుగా అంటే 60 ఏళ్ల కంటే ముందు ఎన్‌పిఎస్ నుంచి విత్‌డ్రా చేసుకుంటే పెన్షన్ కార్పస్‌లో కనీసం 80 శాతం యాన్యుటీ కొనుగోలు కోసం ఉపయోగించుకోవాలి, అది సాధారణ నెలవారీ పెన్షన్‌ను అందిస్తుంది.  మిగిలిన 20 శాతం నిధులను ఒకే మొత్తంగా ఉపసంహరించుకోవచ్చు.  అయితే ఖాతా ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే ఎన్‌పిఎస్ నుంచి ముందుగా ఉప‌సంహ‌రించుకునేందుకు వీలుంటుంది. 
మరణం తరువాత:
చందాదారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు మొత్తం పెన్షన్ కార్పస్ (100 శాతం) నామినీకి లేదా మీరు నియమించిన చట్టపరమైన వారసుడికి అందుతుంది.

ఎన్‌పీఎస్‌ కింద ఎఎస్‌పిలతో లభించే పథకాలు :
1. మీరు పదవీ విరమణ తర్వాత మీ జీవితమంతా యాన్యుటీని పొందుతారు. యాన్యుటెంట్ మరణిస్తే యాన్యుటీ చెల్లింపు ఆగిపోతుంది. యాన్యుటెంట్ అంటే పింఛను సాధారణ చెల్లింపులు లేదా యాన్యుటీలో చేసిన పెట్టుబడిని వసూలు చేయడానికి అర్హత కలిగిన వ్యక్తి.
2. యాన్యుటెంట్ మరణించిన తరువాత చెల్లింపు ఆగిపోతుంది. దీని కొనుగోలు ధర నామినీకి తిరిగి ఇస్తారు.

3. యాన్యుటెంట్ మరణించిన తరువాత, జీవితకాలం  భాగస్వామికి యాన్యుటీ చెల్లించబడుతుంది.  అయితే జీవిత భాగస్వామి  ముందే మ‌ర‌ణిస్తే, యాన్యుటెంట్ మరణించిన తరువాత  చెల్లింపు ఆగిపోతుంది.

4. యాన్యుటెంట్ మరణించిన తరువాత, జీవితకాలం భాగస్వామికి యాన్యుటీ చెల్లించబడుతుంది. జీవిత భాగస్వామి మరణించిన తరువాత కొనుగోలు ధర నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని