ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లురూ.1,13,143 కోట్లు

వరుసగా ఐదో నెలా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2021 ఫిబ్రవరిలో ఇవి రూ.1,13,143 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరి నాటి రూ.1,05,366 కోట్ల కంటే ఇవి 7 శాతం అధికం.

Published : 02 Mar 2021 05:05 IST

 జనవరితో పోలిస్తే 7% వృద్ధి

ఈటీవీభారత్‌: వరుసగా ఐదో నెలా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2021 ఫిబ్రవరిలో ఇవి రూ.1,13,143 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరి నాటి రూ.1,05,366 కోట్ల కంటే ఇవి 7 శాతం అధికం. జీఎస్‌టీ వసూళ్లు రూ.1.1 లక్షల కోట్లను మించడం వరుసగా ఇది మూడో నెల. 2020 డిసెంబరులో రూ.1,15,174 కోట్లు, 2021 జనవరిలో రూ.1,19,847 కోట్లుగా నమోదవ్వడం విదితమే.
ఫిబ్రవరి జీఎస్‌టీ వసూళ్లలో సీజీఎస్‌టీ రూ.21,092 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.27,273 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.55,253 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన పన్నులతో కలిపి), సెస్సులు రూ.9,525 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన సెస్సులతో కలిపి)గా ఉన్నాయి. రెగ్యులర్‌ సెటిల్‌మెంట్‌ కింద ఐజీఎస్‌టీ నుంచి సీజీఎస్‌టీ ఖాతాకు రూ.22,398 కోట్లు, ఎస్‌జీఎస్‌టీకి రూ.17,534 కోట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 50:50 నిష్పత్తిలో ఐజీఎస్‌టీ అడ్‌హక్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.48,000 కోట్లను సెటిల్‌ చేసింది. రెగ్యులర్‌ సెటిల్‌మెంట్‌, అడ్‌హక్‌ సెటిల్‌మెంట్‌ అనంతరం 2021 ఫిబ్రవరిలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్‌టీ కింద రూ.67,490 కోట్లు; ఎస్‌జీఎస్‌టీ కింద రూ.68,807 కోట్లుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని