House Sales: గృహ విక్రయాలు 30% పెరగొచ్చు!

గృహ విక్రయాలు ఈ ఏడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సుమారు 30 శాతం మేర పెరిగి 1.8 లక్షలకు చేరొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ వెల్లడించింది. గిరాకీ మాత్రం కొవిడ్‌ పూర్వ స్థాయి...

Published : 20 Aug 2021 17:05 IST

హైదరాబాద్‌ సహా 7 నగరాలపై అనరాక్‌ నివేదిక

దిల్లీ: గృహ విక్రయాలు ఈ ఏడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సుమారు 30 శాతం మేర పెరిగి 1.8 లక్షలకు చేరొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ వెల్లడించింది. గిరాకీ మాత్రం కొవిడ్‌ పూర్వ స్థాయి కంటే దిగువనే ఉంటుందని తెలిపింది. అనరాక్‌ రీసెర్చ్‌ ప్రకారం, గృహ విక్రయాలు 2020తో పోలిస్తే (1,38,344) ఈ ఏడాది 30 శాతం పెరిగి 1,79,527కు చేరతాయి. 2019లో గృహ విక్రయాలు 2,61,358గా నమోదవ్వడం గమనార్హం. హైదరాబాద్, దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), పుణె, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో గృహ విక్రయాలపై అనరాక్‌ తన అంచనాలు వెలువరించింది. 2022లో 2,64,625 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమవుతాయని, 2023లో 3,17,550కు చేరతాయని అంచనా వేసింది.

‘గృహ నిర్మాణ రంగం 2017 నుంచి ఆరోగ్యకర వృద్ధి నమోదు చేస్తోంది. 2019లో గరిష్ఠాన్ని నమోదు చేసినా, 2020లో కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో డీలా పడింద’ని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి వెల్లడించారు. ఈ ఏడాది గిరాకీకి తగ్గట్టు సరఫరా 35 శాతం, అమ్మకాలు 30 శాతం మేర పెరుగుతాయని తెలిపింది. 2019తో సరఫరా 28 శాతం, అమ్మకాలు 31 శాతం తక్కువగా ఉంటాయని అంచనా వేసింది. అనరాక్‌ డేటా ప్రకారం, 2014లో 3,42,980, 2015లో 3,08,250, 2016లో 2,39,260, 2017లో 2,11143, 2018లో 2,48,311 గృహాలు విక్రయమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని