Debit Card EMI: డెబిట్ కార్డుపై ఈఎంఐ సౌకర్యం అందిస్తున్న ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌

డెబిట్‌కార్డు క‌లిగిన‌ ఖాతాదారులు కూడా అధిక విలువ క‌లిగిన‌ లావాదేవీల‌ను సుల‌భ వాయిదాల‌గా మార్చుకోవ‌చ్చు.

Updated : 21 Oct 2021 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖ‌రీదైన వ‌స్తువులను ఒకేసారి కొనుగోలు చేయాలంటే క‌ష్ట‌మే. అలాంటివారు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసి.. చెల్లించాల్సిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలోకి మార్చుకుని ప్ర‌తినెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తుంటారు. నిజానికి ఈ విధానం వ‌ల్ల చాలా మంది విలువైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌గ‌లుగుతున్నారు. అయితే ఈ సౌక‌ర్యం కేవ‌లం క్రెడిట్ కార్డుదారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు డెబిట్ కార్డుతో చెల్లించిన బిల్లుల‌ను కూడా ఈఎంఐగా మార్చుకునే అవ‌కాశాల‌న్ని క‌ల్పిస్తున్నాయి బ్యాంకులు.

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గ‌త నెల‌లో ఈ స‌దుపాయాన్ని ఖాతాదారుల‌కు అందించ‌గా.. తాజాగా ఇండ‌స్ఇండ్ బ్యాంక్ కూడా అదే బాట‌లో న‌డుస్తోంది. డెబిట్ కార్డుపై ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌) స‌దుపాయాన్ని అందిస్తోంది. దీంతో డెబిట్‌కార్డు క‌లిగిన‌ ఖాతాదారులు కూడా అధిక విలువ క‌లిగిన‌ లావాదేవీల‌ను సుల‌భ వాయిదాలుగా మార్చుకోవ‌చ్చు.

ఇండ‌స్ఇండ్ బ్యాంక్ డెబిట్ కార్డుదారులు ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించి వ‌స్తువును కొనుగోలు చేస్తే.. 3, 6, 9, 12, 18, 24 నెలలు కాల‌ప‌రిమితితో ఈఎంఐలు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రి సామర్థ్యాన్ని బట్టి వారు ఏదైనా ఎంచుకోవచ్చు. కొనుగోలు చేసే వ‌స్తువుల మొత్తం విలువ క‌నీసం రూ. 10వేలు ఉండాలి. ఎలాంటి డాక్యుమెంటేష‌న్ అవ‌స‌రం ఉండ‌దు.

అర్హ‌త‌ను తెలుసుకోండి.. 
మీరు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు అర్హులేనా అని తెలుసుకునేందుకు కస్టమర్లు బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానించిన‌ మొబైల్ నెంబరు నుంచి MYOFR అని టైప్‌ చేసి 5676757కు పంపాలి.

ఫీచ‌ర్లు, ప్ర‌యాజ‌నాలు..
*
ప్రొసెసింగ్ ఫీజు లేదు
* ఖాతాలో డబ్బు బ్లాక్ అవ్వ‌దు
* డౌన్‌పేమెంట్ చేయ‌న‌వ‌స‌రం లేదు
* అవసరమైన ఉత్పత్తులు, సేవలను కొనుగోలు చేసేందుకు 100శాతం ఫైనాన్స్ ల‌భిస్తుంది
* డాక్యుమెంటేషన్ లేదు
* రీ పేమెంట్ కోసం ఖాతాదారులు 3 నెల‌ల నుంచి 24 నెల‌ల వ‌ర‌కు త‌మకు అనువైన కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌చ్చు.
* త‌క్ష‌ణ ఆమోదం, పంపిణీ
* నిరీక్ష‌ణ ఉండ‌దు. ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించ‌కుని - తక్షణమే నిధులను పొందొచ్చు.
* అనుసంధానించిన పొదుపు ఖాతా ద్వారా సుల‌భంగా రీ-పేమెంట్ చేయొచ్చు.
*  నో-ఎక్స్‌ట్రా కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది. ఇది త‌యారీదారు ఇచ్చే డిస్కౌంట్లు/  క్యాష్‌బ్యాక్‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కొన్ని బ్రాండ్లు ‘కన్జూమర్‌ డ్యూరబుల్‌ ప్రోడక్ట్స్‌’పై ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

డెబిట్ కార్డు చెల్లింపులను ఈఎంఐగా మార్చుకునే విధానం...
* ఇండ‌స్ఇండ్ బ్యాంక్ డెబిట్ కార్డు ఈఎంఐ సౌక‌ర్యం మర్చంట్ స్టోర్ల‌ వద్ద, అలాగే ఆన్‌లైన్ వైబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంటుంది. 
* మీకు కావ‌ల‌సిన ప్రొడెక్ట్‌ను ఎంచుకుని మ‌ర్చెంట్ కౌంట‌ర్ వ‌ద్ద పీఓఎస్‌ మెషీన్‌పై డెబిట్ కార్డును స్వైప్ చేయండి. ఆన్‌లైన్‌లో అయితే  పేమెంట్‌ పేజ్‌లో ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు ‘ఇండ‌స్ఇండ్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ’ ఆప్షన్ ఎంచుకోండి.
* 3, 6, 9, 12, 18, 24 నెల‌లలో మీకు కావాల్సిన కాలపరిమితిని ఎంచుకోండి.
* ఇక్క‌డ డెబిట్ కార్డు నంబర్‌, ఎక్స్‌ప‌యిరీ డేట్‌, సీవీవీ వంటి వివ‌రాలు ఇచ్చి, పిన్ ఎంట‌ర్ చేయడంతో లావాదేవీ పూర్త‌వుతుంది. 

వ‌డ్డీ..
* 3 నెల‌ల‌కు 13.99%
* 6 నెల‌ల‌కు 14.99%
* 9 నెల‌ల‌కు 14.99%
* 12 నెల‌ల‌కు 14.99%
* 18 నెల‌ల‌కు 15.99%
* 24 నెల‌ల‌కు 15.99%
* ఆటో- డెబిట్ రిట‌ర్న్ ఛార్జీలు రూ.500+ వ‌ర్తించే ప‌న్ను.
* చెల్లింపు ఆల‌స్య‌మైతే ఛార్జీలు రూ.450+ వ‌ర్తించే ప‌న్ను
* ప్రీ క్లోజ‌ర్‌/ ఫోర్‌క్లోజ‌ర్ ఛార్జీలు.. అవుట్ స్టాండింగ్ అసలు మొత్తంపై 3 శాతం+ వ‌ర్తించే ప‌న్ను
* నెల‌వారీ త‌గ్గిన మొత్తంపై ఈఎంఐ లెక్కిస్తారు.

(Note: బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్లో ఇచ్చిన ఛార్జీల‌ వివరాలు ఇక్కడ ఇచ్చాం.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని