SBI: డెబిట్ కార్డు పోయిందా? ఫోన్ ద్వారా బ్లాక్ చేయండి

ఏటీఎమ్ కార్డును జాగ్ర‌త్త‌గా ఉంచుకోవాలి. ఒక‌వేళ పోతే..దుర్వినియోగం కాకుండా వెంట‌నే బ్లాక్ చేయాలి.

Updated : 19 Jun 2021 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ నేప‌థ్యంలో ఇంటి వ‌ద్దే ప‌లు ర‌కాల బ్యాంకింగ్‌ సేవ‌లు అందించేందుకు సిద్ధ‌మైంది ఎస్‌బీఐ. ఇంటి వ‌ద్దే క్షేమంగా ఉండండి.. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను బ్యాంకుకు రావ‌ల‌సిన అవ‌స‌రం లేకుండానే అందిస్తామంటోంది. ఇందులో భాగంగానే ఏటీఎం కార్డు పోతే బ్యాంకుకు వెళ్లే అవసరం లేదని చెప్తోంది. పాత కార్డును బ్లాక్‌ చేయడంతో పాటు కొత్త డెబిట్‌ కార్డును కూడా ఫోన్ ద్వారానే పొందొచ్చని పేర్కొంటోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

ఎస్‌బీఐ ఖాతాదారులు త‌మ డెబిట్ కార్డును పోగొట్టుకున్న‌ట్లు గుర్తిస్తే ఫోన్ ద్వారా వెంట‌నే కార్డును బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం ఎస్‌బీఐ రెండు టోల్‌ఫ్రీ నంబర్లు కేటాయించింది. 1800 112 211, 1800 425 3800 వీటిలో ఏదో ఒకదానికి కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఖాతాదారుల‌కు అత్య‌వ‌స‌ర బ్యాంకింగ్ సేవ‌ల అందించ‌డం కోసం ఈ రెండు నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు ఎస్‌బీఐ వెల్ల‌డించింది. 

ఒక‌వేళ డెబిట్ కార్డు పోయినా, ఏటీఎం వ‌ద్ద గానీ, మ‌రెక్కడైనా మ‌ర్చిపోయినా ఈ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలి. బ్లాక్ చేయ‌డం కోసం ఎస్‌బీఐ నెట్ బ్యాకింగ్ వంటి ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇత‌ర మార్గాల‌తో పోలిస్తే ఇందుకు ప‌ట్టే స‌మ‌యం చాలా త‌క్కువ‌. 

* దీంతో పాటు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పిన్ జ‌న‌రేష‌న్‌, బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం, చివ‌రి 5 లావాదేవీల గురించి తెలుసుకోవ‌డం, ఆ సమాచారాన్ని ఎస్సెమ్మెస్‌ రూపంలో పొంద‌డం కోసం కూడా ఈ టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేయొచ్చని ఎస్‌బీఐ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని