Benz: మార్కెట్లోకి సరికొత్త బెంజ్‌ జీఎల్‌ఏ కార్లు

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ భారత్లోకి సరికొత్త జీఎల్‌ఏ మోడళ్లను ప్రవేశపెట్టింది. దీనిలో స్టాండర్డ్‌ రకం జీఎల్‌ఏ ,

Published : 25 May 2021 20:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ భారత్‌లోకి సరికొత్త జీఎల్‌ఏ మోడళ్లను ప్రవేశపెట్టింది. దీనిలో స్టాండర్డ్‌ రకం జీఎల్‌ఏ, ఏఎంజీ జీఎల్‌ఏ 35 కూడా ఉన్నాయి. వీటి ధర రూ.42.10 లక్షలు, రూ.57.30 లక్షలుగా నిర్ణయించారు. ఇవి కేవలం  ప్రారంభ ఆఫర్‌ ధరలు మాత్రమే అని కంపెనీ పేర్కొంది. జులై1వ తేదీ నుంచి వీటి ధరలు రూ.1.5 లక్షల వరకు పెరుగుతాయని వెల్లడించింది. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాలు విధించిన నిబంధనలకు అనుకూలంగా జీఎల్‌ఏ మోడల్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఈ రెండు కార్లు పూర్తిగా సీకేడీ మార్గంలో భారత్‌ వస్తాయి. ఇక్కడ వాటిని అసెంబ్లింగ్‌ చేస్తారు. భారత్‌లో అసెంబ్లింగ్‌ చేస్తున్న మూడో ఏఎంజీ మోడల్‌గా ఇది నిలుస్తోంది. ఏఎంజీ జీఎల్‌సీ 43 కూపే, ఏఎంజీ ఏ 35 సెడాన్‌లు మాత్రమే చేస్తున్నారు. ఇక స్టాండర్డ్‌ జీఎల్‌ఏ వేరియంట్‌ మొత్తం మూడు మోడళ్లలో వస్తోంది. వీటిల్లో జీఎల్‌ఏ 200  రూ.42.10 లక్షలు, జీఎల్‌ఏ220డీ రూ. 43.7 లక్షలు, జీఎల్‌ఏ 220డీ మాటిక్‌ రూ.46.7 లక్షలుగా ఉంది.

ఈ కార్ల విడుదల సందర్భంగా బెంజ్‌ ఇండియా ఎండీ సీఈవో మార్టిన్‌ షెవెంక్‌ మాట్లాడుతూ ‘‘సరికొత్త జీఎల్‌ఏని దూకుడు టెక్నాలజీని రంగరించి చేశాం. కస్టమర్లు ఇటువంటి ప్రొడక్ట్‌ కోసం ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నారు. ఇది భారత్‌లో తయారైన ఏఎంజీ వలే అందుబాటులోకి వస్తుంది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా  8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని కూడా  ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. 

ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో లభిస్తున్నాయి. జీఎల్‌ఏలో 1.3లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌ 161 బీహెచ్‌పీ శక్తిని.. 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 188 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. వీటికి 7స్పీడ్‌ డీసీటీ యూనిట్‌ను అమర్చారు. ఇక ఏంజీ జీఎల్‌ఏ 35లో 2.0 లీటర్‌ 4 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఇది.. 302బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో 8స్పీడ్‌ డీసీటీని అమర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని