క్రెడిట్ కార్డు ద్వారా ఎన్‌పీఎస్ డిపాజిట్

ప్ర‌జ‌లు ఎన్‌పీఎస్ వైపు మొగ్గుచూపేందుకు మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఎన్‌పీఎస్‌పై ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల‌ను స‌వరించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ సమ‌యంలో లేదా 60 ఏళ్ల వ‌య‌సులో ఎన్‌పీఎస్ చందాదారుడు 60 శాతం నిధిని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. దీనిపై ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. గ‌తంలో ఇది 40 శాతంగా ఉండేది. ఎన్‌పీఎస్‌లో ఆన్‌లైన్..

Published : 18 Dec 2020 15:06 IST

ప్ర‌జ‌లు ఎన్‌పీఎస్ వైపు మొగ్గుచూపేందుకు మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఎన్‌పీఎస్‌పై ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల‌ను స‌వరించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ సమ‌యంలో లేదా 60 ఏళ్ల వ‌య‌సులో ఎన్‌పీఎస్ చందాదారుడు 60 శాతం నిధిని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. దీనిపై ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. గ‌తంలో ఇది 40 శాతంగా ఉండేది. ఎన్‌పీఎస్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు ద్వారా కూడా డిపాజిట్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే ఛార్జీలు వ‌ర్తిస్తాయి. దీంతోపాటు డెబిట్ కార్డ్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ స‌దుపాయం కూడా ఉంది.

ఆన్‌లైన్ ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాలో డిపాజిట్ చేసేంఉకు యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌తో ఖాతాను లాగిన్ చేయాలి. ఆ త‌ర్వాత‌ ‘Transact Online’ ట్యాబ్‌ను సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత ‘Contribute Online’ ను ఎంచుకోవాలి. దీంతోపాటు eNPS వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఖాతాలో డ‌బ్బు జ‌మ‌చేసే అవ‌కాశం కూడా ఉంది.

అప్పుడు చందాదారులు PRAN (Permanent Retirement Account Number) ఎంట‌ర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది త‌ర్వాత మొబైల్ కి మెయిల్‌కి లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత ఖాతాదారులు టైర్ 1 లేదా టైర్ 2 ఖాతాను ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పేమెంట్ ఆప్ష‌న్స్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ లేదా ఇంట‌న్నెట్ బ్యాంకింగ్ ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసిన రెండు రోజుల త‌ర్వాత ఎన్‌పీఎస్ ఖాతాలో జ‌మ‌వుతాయి.

ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేముందు ఛార్జీల‌ను ఒక‌సారి ప‌రిశీలించాలి. నెట్ బ్యాంకింగ్ (60 పైస‌లు + జీఎస్‌టీ 18 శాతం), డెబిట్ కార్డ్ ( లావాదేవీలో 0.80 శాతం +జీఎస్‌టీ 18 శాతం, క్రెడిట్ కార్డ్ (లావాదేవీలో 0.90 శాతం + జీఎస్‌టీ 18 శాతం). అయితే డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులలు రూ.2 వేల‌కు మాత్ర‌మే ప‌రిమితం.

దీంతోపాటు డిపాజిట్ చేసే మొత్తంపై 0.10 శాతం పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ (పీఓపీ) క‌మీష‌న్ 0.10 శాతం వ‌ర్తిస్తుంది. (ఇది రూ.10 నుంచి గ‌రిష్ఠంగా రూ.10 వేల వ‌ర‌కు ఉంటుంది). ఈఎన్‌పీఎస్ ద్వారా చెల్లిస్తే చందాదారుల‌కు ఇది వ‌ర్తించ‌దు. డిపాజిట్ చేసిన రెండు రోజుల త‌ర్వాత ఖాతాలో జ‌మ‌వుతుంది.

యాప్ ద్వారా ఎన్‌పీఎస్ డిపాజిట్ చేయ‌డం
ఎన్‌పీఎస్ చందాదారులు ఎన్‌పీఎస్ యాప్ ద్వారా కూడా ఖాతాలో జ‌మ‌చేయ‌వ‌చ్చు. ప్రాన్ అవ‌స‌రం లేకుండా నేరుగా చెల్లించే అవ‌కాశం యాప్ ద్వారా ఉంటుంది. ప్ర‌తి ఏడాది టైర్ 1 ఖాతాదారుడైతే క‌నీసం రూ.100 ఖాతాలో జ‌మ‌చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని