నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌

ఎలక్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో బ్యాంకు ఖాతాలో న‌గ‌దు జ‌మ‌చేసే ఒక‌ విధాన‌మే నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ (నెఫ్ట్‌). ఇది దేశ‌వ్యాప్తంగా ఆమోదింప‌యోగ్య‌మైన విధానం..

Published : 15 Dec 2020 17:58 IST

ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చెల్లింపులు జరిపే విధానాల్లో ఎన్‌ఈఎఫ్‌టీ ఒకటి. ఒక లావాదేవీలో రూ. 50,000 వరకూ ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీచేసేందుకు ఉద్దేశించిన విధానమిది.

  • నిర్ణీత సమయాలలో బ్యాచ్ల వారీగా నగదు బదిలీ జరుగుతుంది. ప్రస్తుతం మొత్తం 12 బ్యాచ్లలో జరుగుతుంది.
  • నెఫ్ట్‌ ద్వారా ఒక రోజులో రూ. 1 మొదలుకొని ఎంత మొత్తమైనా బదిలీ చేసే వీలుంది. అయితే ఒక లావాదేవీలో గరిష్టంగా రూ. 50000 వరకూ మాత్రమే పంపగలరు.

నెఫ్ట్‌ పనిచేసే సమయాలు

  • సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు
  • శనివారం రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు
  • ఆదివారం ఈ సేవ అందుబాటులో ఉండదు.

నెఫ్ట్‌ ద్వారా నగదు బదిలీ చేసే విధానం

  • మొదట యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి.
  • పేమెంట్స్‌, ట్రాన్స్‌ఫర్ ట్యాబ్‌లో ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ను ఎంచుకోవాలి.
  • అదే బ్యాంకుకు సంబంధించిన శాఖకు లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన శాఖలకు పంపుతున్నారా అనే ఆప్షన్‌ వస్తుంది. ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఇంతకు ముందే ఖాతాలో జతచేసుకున్న ఖాతా సంఖ్యను ఎంచుకోమని అడుగుతుంది. అలాకాకుండా మీ జాబితాలో లేని కొత్తదానికి పంపాలనుకుంటే ఖాతా వివరాలను జతచేసుకోవాలి.
  • బదిలీ చేయాలనుకున్న ఖాతా వివరాలను నమోదు చేయాలి.
  • భద్రత కోసం ఏటీఎమ్‌ / డెబిట్‌ కార్డుకు సంబంధించిన వివరాలను అడగవచ్చు.
  • సబ్‌మిట్‌ నొక్కగానే లావాదేవీ పూర్తయినట్లు కంప్యూటర్‌ తెర మీద సందేశం వస్తుంది.

ఏ కారణంచేతైనా లబ్ధిదారుకు డబ్బు చేరకపోతే, డబ్బు తిరిగి పంపినవారి ఖాతాలో జమ అవుతుంది.

సేవా రుసుములు

Screen Shot 2017-01-18 at 18.01.17.png

నెఫ్ట్‌ ద్వారా నగదు పంపేందుకు అవసరమయ్యే వివరాలు

లబ్ధిదారు పేరు, బ్యాంకు ఖాతా సంఖ్య, బ్రాంచి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వివరాలను నమోదు చేసి నగదు బదిలీ చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని