Netflix Subscription: నెట్‌ఫ్లిక్స్‌ ధరల తగ్గింపు!

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ సభ్యత్వ రుసుమును తగ్గించింది. ఓటీటీ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వీక్షకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది....

Updated : 14 Dec 2021 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ సభ్యత్వ రుసుమును తగ్గించింది. ఓటీటీ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వీక్షకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా సభ్యత్వం తీసుకునేవారికి గరిష్ఠంగా 60 శాతం వరకూ తగ్గింపు లభించనుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ నెలవారీ సభ్యత్వానికి రూ.199 చెల్లించాల్సి ఉండగా ఇకపై ఇది రూ.149కే లభించనుంది. తగ్గిన ధరలు నేటి నుంచే (మంగళవారం) అమల్లోకి రానున్నట్లు ట్విటర్‌ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఇక బేసిక్‌ ప్లాన్‌ ధరను రూ.499 నుంచి రూ.199కి తగ్గించారు. అలాగే స్టాండర్డ్‌ ప్లాన్‌కు రూ.499, ప్రీమియం ప్లాన్‌కు రూ.649 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇవి వరుసగా రూ.649, రూ.799 వద్ద అందుబాటులో ఉండేవి.

వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు గత కొంత కాలంగా విశేష ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో వీటి సబ్‌స్క్రిప్షన్‌లు భారీగా పెరిగాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌, జీ5, ఆహా, హంగామా, ఏఎల్‌టీ బాలాజీ వంటి సంస్థలు వీక్షకులను ఆకట్టుకునేందుకు వినూత్న కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. దీంతో వీటి మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది.

మరోవైపు అమెజాన్‌ ప్రైమ్ సభ్యత్వ రుసుము నేటి నుంచి మరింత ప్రియమైంది. ఇకపై 50శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సభ్యత్వం రూ.999 ఉండగా రూ.1,499 చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం నెలవారీ సభ్యత్వ రుసుము రూ.129గా ఉండగా, పెంపుతో రూ.179గానూ (38శాతం అదనం), మూడు నెలలకు రూ.329 కాస్తా, రూ.459(39శాతం అదనం) అవుతుంది.

Read latest Business News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని