e-cycle: నెక్స్‌జూ మొబిలిటీ నుంచి రూ.54 వేల ఈ-సైకిల్‌

పుణె కేంద్రంగా పనిచేస్తున్న విద్యుత్తు వాహన తయారీ సంస్థ నెక్స్‌జూ మొబిలిటీ తమ ఈ-సైకిల్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది....

Published : 21 Jan 2022 15:07 IST

ముంబయి: పుణె కేంద్రంగా పనిచేస్తున్న విద్యుత్ వాహన (EV) తయారీ సంస్థ నెక్స్‌జూ మొబిలిటీ (Nexzu Mobility) తమ ఈ-సైకిల్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. బజింగ పేరిట మరో కొత్త సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇందులో కార్గో, కమ్యూటర్‌ రెండు వేరియంట్లు ఉన్నాయి. కార్గో ధర రూ.54,525 కాగా.. కమ్యూటర్‌ ధర రూ.49,445. వచ్చే నెల ఇవి మార్కెట్‌లోకి రానున్నాయి. కంపెనీ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌, సామాజిక మాధ్యమాల్లో కావాల్సిన వారు ఇప్పుడే బుక్‌ చేసుకోవచ్చు. ఒకసారి దీని లిథియం-ఐయాన్‌ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 100 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. కార్గో సైకిల్‌పై 15 కిలోల వరకు బరువును మోసుకెళ్లొచ్చని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని