DA: డీఏ పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపును పునరుద్ధరిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సామాజిక....

Published : 27 Jun 2021 20:40 IST

స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ

దిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపును పునరుద్ధరిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జులై నుంచి డీఏ పెంపును పునరుద్ధరిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ నకిలీ డాక్యుమెంట్‌ చక్కర్లు కొడుతోందని పేర్కొంది. ఇప్పటి వరకు అలాంటి ఆదేశాలేవీ జారీ చేయలేదని స్పష్టం చేసింది.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, కేంద్ర ప్రభుత్వ పంఛనుదారుల డీఆర్‌ పెంపును ఈ ఏడాది జూన్‌ 30 వరకు నిలిపివేస్తూ గత సంవత్సరం ఏప్రిల్‌లో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛనుదారులపై ప్రభావం పడింది. జనవరి 1, 2020, జులై 1, 2020, జనవరి 1, 2021.. ఇలా మూడు దఫాల్లో పెరగాల్సిన డీఏ నిలిచిపోయింది. రానున్న జులై 1న మరో పెంపు ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిర్ణయం కోసం ఉద్యోగులు వేచిచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని