త‌పాలా శాఖ‌ జీవిత బీమా (పీఎల్ఐ)

త‌పాలా శాఖ అందించే బీమా ప‌థ‌కాలు వాటి వివ‌రాలు

Published : 22 Dec 2020 15:26 IST

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌లో ప‌నిచేయు ఉద్యోగులకు అన‌గా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, విశ్వ‌విద్యాల‌యాలు, ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ‌లు, జాతీయ బ్యాంకులు, స్థానిక సంస్థ‌లు,స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల సంస్థ‌లు, క‌నీసం 10 శాతం ప్ర‌భుత్వ వాటా ఉన్న ఉమ్మ‌డి వ్యాపారాలు /ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు (పీఎస్‌యు), క్రెడిట్ స‌హ‌కార సంఘాలు మొద‌లైన వాటికి త‌పాల జీవిత బీమా (పీఎల్ఐ) ద్వారా బీమా సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తుంది. పీఎల్ఐ త‌న సేవ‌ల‌ను ర‌క్ష‌ణ సేవ‌లు పారా-మిల‌ట‌రీ ద‌ళాల వారికి కూడా విస్త‌రించింది.

పీఎల్ఐ అందించే 6 ర‌కాల బీమా పాల‌సీలు:

  1. హోల్ లైఫ్ పాల‌సీ - సుర‌క్షా

  2. ఎండోమెంట్ పాల‌సీ - సంతోష్‌

  3. క‌న్వ‌ర్ట‌బుల్ హోల్ లైఫ్ పాల‌సీ - సువిధ‌

  4. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాల‌సీ - సుమంగ‌ళ్‌

  5. జాయింట్ లైఫ్ పాల‌సీ - యుగ‌ళ్ సుర‌క్షా

  6. పిల్లల పాల‌సీ - బాల జీవ‌న్ బీమా

పీఎల్ఐ బీమా ప‌థ‌కాల‌ ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు:

  1. హోల్ లైఫ్ పాల‌సీ - సుర‌క్షా

  • ఈ ప‌థ‌కం ద్వారా బీమా చేసిన వ్యక్తికి 80 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు త‌ర్వాత భీమా హామీ మొత్తాన్ని, బోన‌స్‌తో క‌లిపి ఇస్తారు.

  • ఒక వేళ బీమా చేసిన వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్ల‌యితే అత‌ని/ఆమె చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు ఈ మొత్తాన్ని అంద‌చేస్తారు. పాల‌సీ అమ‌లులో వుండ‌గా ఏది ముందుగా సంభ‌విస్తుందో దాని ప్ర‌కారం క్లైం చేసిన తేదీ నుండి అమ‌లు ప‌రుస్తారు.

  • బీమాదారుని వ‌య‌స్సు 19 నుండి 55 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • బీమా క‌నీస హామీ రూ.20,000. గ‌రిష్ట హామీ రూ.50ల‌క్ష‌లు

  • బీమా చేసిన 4 సంవ‌త్స‌రాల అనంత‌రం నుండి రుణం తీసుకోవ‌చ్చు.

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి ఇచ్చివేయ‌చ్చు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 85బోన‌స్ అందిస్తున్నారు.

హోల్‌లైఫ్ పాల‌సీ - నెల‌వారీ ప్రీమియం ప‌ట్టిక‌

  1. ఎండోమెంట్ పాల‌సీ - సంతోష్‌

  • ఈ ప‌థ‌కం కింద బీమా చేసిన వారు ముందుగా నిర్ణ‌యించుకున్న‌35,40,45,50,55,58,60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు త‌రువాత‌ బీమా హామీ, బోన‌స్‌ల‌ను అంద‌చేస్తారు.

  • ఒక వేళ పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే బీమా హామీ, బోన‌స్‌ను వారి నామినీ లేదా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు అంద‌చేస్తారు.

  • బీమాదారుని వ‌య‌స్సు 19 నుండి 55 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • బీమా క‌నీస హామీ రూ.20,000. గ‌రిష్ట హామీ రూ.50ల‌క్ష‌లు

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల అనంత‌రం నుండి రుణం తీసుకోవ‌చ్చు.

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి ఇచ్చివేయ‌చ్చు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 58 బోన‌స్ అందిస్తున్నారు.

ఎండోమెంట్‌ పాల‌సీ - నెల‌వారీ ప్రీమియం ప‌ట్టిక‌

  1. క‌న్వ‌ర్ట‌బుల్ హోల్ లైఫ్ పాల‌సీ - సువిధ‌

  • ఇది కూడా జీవిత మొత్తం హామీ నందించే హోల్ లైఫ్ పాల‌సీ వ‌లే వ్య‌వ‌హ‌రిస్తుంది. అయితే బీమా చేసిన 5 సంవ‌త్స‌రాల అనంత‌రం ఎండోమెంట్ పాల‌సీకి
    మారేందుకు అవ‌కాశం ఉంటుంది.

  • కాల‌వ్య‌వ‌ధి పూర్తి అయిన త‌దుప‌రి బీమా హామీ, బోన‌స్‌ల‌ను ఇస్తారు.

  • ఒక వేళ పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే బీమా హామీ, బోన‌స్‌ను వారి నామినీ లేదా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు అంద‌చేస్తారు.

  • బీమాదారుని వ‌య‌స్సు 19 నుండి 50 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • భీమా క‌నీస హామీ రూ.20,000. గ‌రిష్ట హామీ రూ.50ల‌క్ష‌లు

  • భీమా చేసిన 4 సంవ‌త్స‌రాల అనంత‌రం నుండి రుణం తీసుకోవ‌చ్చు.

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి ఇచ్చివేయ‌చ్చు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 85 బోన‌స్ అందిస్తున్నారు. (ఇది హోల్ లైఫ్ పాల‌సీ నుండి ఎండోమెంట్ పాల‌సీకి మార్పు చెంద‌ని వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.)

క‌న్వ‌ర్ట్‌బుల్‌ హోల్ లైఫ్ పాల‌సీ - నెల‌వారి ప్రీమియం ప‌ట్టిక‌

  1. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాల‌సీ - సుమంగ‌ళ్‌
    ఇది గ‌రిష్టంగా రూ. 50ల‌క్ష‌లు బీమా హామీ అందించే మ‌నీ బ్యాక్ పాల‌సీ. నిర్ణీత కాల ప‌రిమితిలో తిరిగి వ‌చ్చే హామీ మొత్తం ఆశించేవారికి బాగుంటుంది.
    నిర్ణీత కాల ప‌రిమితిలో నిర్ధిష్ట హామీ మొత్తాన్ని తిరిగి పొంద‌వ‌చ్చు.

  • ఒక‌వేళ బీమా చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే ముందు చెల్లించిన బీమాను మిన‌హాయించకుండా పూర్తి ప్ర‌యోజ‌నాల‌ను చెల్లిస్తారు. అటువంటి సంద‌ర్భాల‌లో బీమా హామీ, బోన‌స్‌ల మొత్తాన్ని నామినీ లేదా చ‌ట్ట‌బ‌ధ్ద‌మైన వార‌సుల‌కు అంద‌చేస్తారు.

  • పాల‌సీ నిర్ణీత స‌మయం 15, 20 సంవ‌త్స‌రాలు.

  • పాల‌సీ దారుని ప్ర‌వేశ వ‌య‌స్సు -
    20 సంవ‌త్స‌రాల పాల‌సీకి 19 నుండి 40 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.
    15 సంవ‌త్స‌రాల పాల‌సీకి 19 నుండి 45 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • నిర్ణీత కాల ప‌రిమితిలో తిరిగి వ‌చ్చే హామీ మొత్తం- 20 సంవ‌త్స‌రాల పాల‌సీకి ప్ర‌తి 8, 12,16 సంవ‌త్స‌రాల‌కు 20 శాతం చొప్పున ఇస్తారు. కాల‌వ్య‌వ‌ధి పూర్తి అయిన అనంత‌రం మిగిలిన‌40 శాతం, బోన‌స్ ఇస్తారు. 15 సంవ‌త్స‌రాల పాల‌సీకి ప్ర‌తి 6,9,12 సంవ‌త్స‌రాల‌కు 20 శాతం చొప్పున ఇస్తారు. కాల‌వ్య‌వ‌ధి అనంత‌రం మిగిలిన‌ 40 శాతం, బోన‌స్ ఇస్తారు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 53 బోన‌స్ అందిస్తున్నారు.

యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాల‌సీ - నెల‌వారీ ప్రీమియం ప‌ట్టిక‌

  1. జాయింట్ లైఫ్ పాల‌సీ - యుగ‌ళ్ సుర‌క్షా:

ఇది నిర్ణీత కాల‌నికి బీమా చేసిన వ్య‌క్తితో పాటు వారి జీవిత భాగ‌స్వామికి కూడా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

  • బీమా చేసిన వ్య‌క్తితో పాటు అత‌ను/ఆమె జీవిత భాగ‌స్వామికి కూడా బీమాహామీ, బోన‌స్‌ల‌ను అంద‌చేస్తారు.

  • బీమా క‌నీస హామీ రూ.20,000. గ‌రిష్ట హామీ రూ.50ల‌క్ష‌లు

  • పాల‌సీ దారుని భాగ‌స్వామి ప్ర‌వేశ వ‌య‌స్సు 21 నుండి 45 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • ఇద్ద‌రి వ‌య‌స్సు 21 నుండి 45 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల అనంత‌రం నుండి రుణం తీసుకోవ‌చ్చు.

  • ఇద్ద‌రు పాల‌సీ దారుల‌లో ఒక‌రు మ‌ర‌ణించిన‌ట్ల‌యితే రెండ‌వ వారికి బీమా మొత్త‌న్ని, బోన‌స్‌ల‌ను పొందుతారు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 58 బోన‌స్ అందిస్తున్నారు.

జాయింట్ లైఫ్ పాల‌సీ - నెల‌వారీ ప్రీమియం ప‌ట్టిక‌

  1. పిల్ల‌ల పాల‌సీ - బాల్ జీవ‌న్ బీమా

  • పాల‌సీదారుని పిల్ల‌ల‌కు బీమా ప్ర‌యోజ‌నాల అందిస్తున్నారు.

  • ఒక పాల‌సీదారుని ఇద్ద‌రు పిల్ల‌ల వ‌ర‌కు పాల‌సీ ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తున్నారు.

  • పిల్ల‌ల ప్ర‌వేశ వ‌య‌స్సు 5 నుండి 20 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • త‌ల్లి/త‌ండ్రి చేసిన బీమా మొత్తం 3 ల‌క్ష‌ల‌కు మించ‌కుండా ఇస్తారు.

  • పాల‌సీ దారుని ప్రవేశ వ‌య‌స్సు 45 సంవ‌త్స‌రాల‌కు మించ‌కూడ‌దు.

  • ఒక‌వేళ‌ పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి (త‌ల్లి/త‌ండ్రి) మ‌ర‌ణిస్తే వారి పిల్ల‌లు ఎటువంటి ప్రీమియం చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. కాల‌వ్య‌వ‌ధి పూర్తి అయిన అనంత‌రం బీమా హామీ, బోన‌స్‌ల‌ను పిల్ల‌ల‌కు అంద‌చేస్తారు.

  • పిల్ల‌ల పాల‌సీ విష‌య‌మై, ప్రీమియం చెల్లింపుల విష‌యంలో పాల‌సీదారుని (త‌ల్లి/త‌ండ్రి) బాద్య‌త క‌లిగి ఉండాలి.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 58 బోన‌స్ అందిస్తున్నారు.

ప్ర‌యోజ‌నాలు:

ప్ర‌స్తుతం భార‌త దేశంలో జీవిత బీమా అందించే సంస్థ‌ల‌లో పీఎల్ఐ మాత్ర‌మే, అన్ని పాల‌సీల‌లో అతి త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ రాబ‌డుల‌ను ఇస్తుంది.

పీఎల్ఐలో ఈ కింద ప్ర‌యెజ‌నాలు అందుబాటులో ఉన్నాయి.

  1. నామీని మార్పు.

  2. పాల‌సి ఇచ్చు అధికారి అనుమ‌తితో, ఎండోమెంట్ పాల‌సీ చేసిన మూడు సంవ‌త్స‌రాల అనంత‌రం, హోల్ లైఫ్ పాల‌సీ చేసిన నాలుగు సంవ‌త్స‌రాల అనంత‌రం లోను పొంద‌వ‌చ్చు.

  3. ఏదైనా ఫైనాన్సియ‌ల్ సంస్థ‌కు పాల‌సీని ఇచ్చి రుణం పొంద‌వ‌చ్చు.

  4. మూడు సంవ‌త్స‌రాల లోపు పాల‌సీకి సంబంధించి వ‌రుస‌గా 6 ప్రీమియంలు చెల్లించ‌క పోతే పాల‌సీ ర‌ద్ద‌వుతుంది.
    మూడు సంవ‌త్స‌రాలుకు మించి ఉన్న పాల‌సీకి సంబంధించి వ‌రుస‌గా 12 ప్రీమియంలు చెల్లించ‌క‌పోతే పాల‌సీ ర‌ద్ద‌వుతుంది.

  5. ఒరిజిన‌ల్‌ బాండ్ ప్ర‌మాద‌వసాత్తు న‌లిగిపోయిన‌, కాలిపోయిన‌, చిరిగిపోయిన‌, సంద‌ర్భాల‌లో డూప్లికేట్ బాండ్ ఇస్తారు.

త్రైమాసిక, వార్షిక ప్రీమియంల కోసం, మ‌రిన్ని వివ‌రాల‌కు మీ ద‌గ్గ‌ర‌లోని పోస్టాఫీసును సంప్ర‌దించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని