గృహరుణాల్లో ఎస్‌బీఐ రికార్డు

గృహ రుణాల వ్యాపారంలో ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రికార్డు సృష్టించింది. ఎస్‌బీఐకి చెందిన రియల్‌ఎస్టేట్‌ అండ్‌ హౌసింగ్ బిజినెస్‌ యూనిట్‌ గత పదేళ్లలో ఐదు రెట్లు పెరిగి రూ. 5లక్షల కోట్లు

Published : 10 Feb 2021 21:37 IST

ముంబయి: గృహ రుణాల వ్యాపారంలో ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రికార్డు సృష్టించింది. ఎస్‌బీఐకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ హౌసింగ్ బిజినెస్‌ యూనిట్‌ విలువ గత పదేళ్లలో ఐదు రెట్లు పెరిగి రూ.5 లక్షల కోట్లు దాటిందని బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా బుధవారం వెల్లడించారు. ఈ యూనిట్‌ నిర్వహణ ఆస్తుల విలువ 2011లో రూ.89,000 కోట్లు ఉండగా.. 2021 నాటికి ఇది రూ.5 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు.

కస్టమర్ల విశ్వాసం వల్లే ఈ అసాధారణ ఘనత అందుకోగలిగామని దినేశ్‌ ఖారా ఈ సందర్భంగా తెలిపారు. గృహ రుణాల మార్కెట్లో 34 శాతం షేరుతో దేశంలో అతిపెద్ద రుణ సంస్థగా ఉన్నామని చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి నిర్వహణ ఆస్తుల విలువ రూ.7 లక్షల కోట్లకు చేరాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుత వ్యవస్థలో వ్యక్తిగత సేవలకు సాంకేతికతను కూడా జోడించడం ముఖ్యమన్నారు. గృహ రుణాల డెలివరీ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు పలు డిజిటల్‌ ఆవిష్కరణలను తీసుకొస్తామన్నారు. 

ఇవీ చదవండి..

బ్యాంక్‌కు వెళ్లకుండానే.. పీఎన్‌బీఐలో గృణరుణం

గృహ రుణాలపై వర్తించే ఛార్జీలేంటో తెలుసా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని