అంబానీ సోదరులకు రూ.25 కోట్ల జరిమానా

ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ, మరికొందరు వ్యక్తులు, సంస్థలపై మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ రూ.25 కోట్ల అపరాధ రుసుమును విధించింది.

Published : 08 Apr 2021 13:29 IST

 21 ఏళ్ల నాటి కేసులో సెబీ విధింపు

దిల్లీ: ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ, మరికొందరు వ్యక్తులు, సంస్థలపై మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ రూ.25 కోట్ల అపరాధ రుసుమును విధించింది. 2000 సంవత్సరంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టేకోవర్‌ నిబంధనలను పాటించని కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. ముకేశ్‌ భార్య నీతా; అనిల్‌ భార్య టీనాలపైనా అపరాధ రుసుము విధించారు. ఆర్‌ఐఎల్‌ ప్రమోటర్లు, పర్సన్స్‌ యాక్టింగ్‌ ఇన్‌ కాన్సర్ట్‌(పీఏసీ)లు 2000 సంవత్సరంలో సంస్థలో 5 శాతం వాటా కంటే ఎక్కువ కొనుగోలు అంశాన్ని బయటకు వెల్లడించడంలో విఫలమయ్యారని సెబీ తన 85 పేజీల ఆదేశంలో పేర్కొంది. ధీరూభాయ్‌ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని 2005లో ముకేశ్, అనిల్‌లు పంచుకున్న సంగతి తెలిసిందే. పీఏసీతో కలిసి ప్రమోటర్లు ఆర్‌ఐఎల్‌లో జనవరి 7, 2000లో 6.83 శాతం వాటా కొనుగోలు చేశారు. 5 శాతం కంటే ఎక్కువ వాటా కొనుగోలు చేస్తే ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే అలా జరగలేదని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సంయుక్తంగా రూ.25 కోట్ల అపరాధ రుసుమును విధించింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని