టవర్‌ ఇన్‌ఫ్రా చేతికి స్పేస్‌ టెలీఇన్‌ఫ్రా

భారత టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ స్పేస్‌ టెలీఇన్‌ఫ్రాను బ్రూక్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ పెట్టుబడుల దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్‌కు చెందిన టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ రూ.900 కోట్లకు కొనుగోలు చేయనుంది. దేశంలో అన్ని మొబైల్‌ ఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు స్పేస్‌ టెలీఇన్‌ఫ్రా సేవలు అందిస్తోంది.

Published : 21 Jul 2021 01:08 IST

విలువ రూ.900 కోట్లు

దిల్లీ: భారత టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ స్పేస్‌ టెలీఇన్‌ఫ్రాను బ్రూక్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ పెట్టుబడుల దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్‌కు చెందిన టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ రూ.900 కోట్లకు కొనుగోలు చేయనుంది. దేశంలో అన్ని మొబైల్‌ ఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు స్పేస్‌ టెలీఇన్‌ఫ్రా సేవలు అందిస్తోంది. వీటితో పాటు లఖ్‌నవూ మెట్రో, దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ వ్యాపార సంస్థలకు సేవలు ఇస్తోంది. టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ నెలకొల్పింది. 2020 సెప్టెంబరులో దీన్ని బ్రూక్‌ఫీల్డ్‌ రూ.25,215 కోట్లకు కొనుగోలు చేసింది.


బెంగళూరులో సాంకేతిక కేంద్రం
500 మందికి పైగా నిపుణుల నియామకం: జీ

దిల్లీ: బెంగళూరులో సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీ) వెల్లడించింది. డిజిటలీకరణ ప్రక్రియ జీ 4.0లో భాగంగా నెలకొల్పనున్న ఈ కేంద్రంలో డిజైన్‌, సాంకేతికత, డేటా, సైబర్‌ భద్రత విభాగాల్లో విశేష అనుభవమున్న 500 మందికి పైగా అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ఇప్పటికే 120 మంది చేరారని తెలిపింది. ఈ బృందం రూపొందించే ఉత్పత్తులు, సొల్యూషన్లు కంపెనీ డిజిటలీకరణకు దోహదం చేయడంతో పాటు వివిధ విభాగాల్లో వృద్ధి మార్గాల అన్వేషణకు తోడ్పడుతుందని జీ పేర్కొంది. తమ వ్యాపారాల మధ్య పరస్పర సమన్వయాన్ని పెంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, డేటా సొల్యూషన్ల అభివృద్ధిపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుందని జీ (టెక్నాలజీ, డేటా) ప్రెసిడెంట్‌ నితిన్‌ మిత్తల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు