ప‌సిడి, స్థిరాస్తి రాబ‌డిపై ప‌న్నుఎలా?

ప‌సిడి, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే స్వ‌ల్ప‌, దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం. మ‌న దేశంలో మ‌దుప‌ర్ల‌కు బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డులతో బంధం ఎక్కువ‌నే చెప్పాలి.

Published : 25 Dec 2020 19:55 IST

ప‌సిడి, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే స్వ‌ల్ప‌, దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం. మ‌న దేశంలో మ‌దుప‌ర్ల‌కు బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డులతో బంధం ఎక్కువ‌నే చెప్పాలి. వాటిపై వ‌చ్చే రాబ‌డి కంటే కూడా వాటి వినియోగం ద్వారా ఎక్కువ సంతృప్తి ని పొందుతారు. బంగారంతో ఆభ‌ర‌ణాలుగా చేసుకుని అలంక‌రించుకుటారు. స్థిరాస్తి అయితే సొంతిట్లో ఉండ‌టం ద్వారానో లేదా స్థ‌లం కొనుగోలు చేసి ఆర్థికంగా భ‌ద్ర‌త‌ పొంద‌డం చేస్తుంటారు. అయితే ఇవ‌న్నీ మ‌న సంప్రాదాయాలు, కోరిక‌ల‌తో ముడిప‌డి ఉంటాయి. పెట్టుబ‌డి కోణంలో చూస్తే వీటిపైవ‌చ్చే రాబ‌డికి ప‌న్ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం చెల్లించాల్సి ఉంటుంది… ఇప్ప‌డు బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డుల ద్వారా వ‌చ్చే స్వ‌ల్ప‌ దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం.

ప‌సిడి పెట్టుబ‌డుల‌పై ప‌న్నుఇలా..

బంగారం పెట్టుబ‌డిలో దీర్ఘ‌కాలం అంటే 3 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డి పెట్టుబ‌డి చేయాలి. మూడేళ్ల కంటే త‌క్కువ కాలం పెట్టుబ‌డి చేస్తే స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు.

సార్వ‌భౌమ బంగారు బాండ్లు కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేస్తుంది. వీటిపై ప‌న్ను స్వ‌ల్ప‌,దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డిపై మామూలు బంగారు పెట్టుబ‌డుల‌కు వ‌ర్తించిన‌ట్లే ఉంటుంది. అయితే ఇందులో వ‌డ్డీ ఆదాయం కూడా ఉంటుంది. దానికి స్లాబ్ రేటు వ‌ద్ద మ‌దుప‌రి ప‌న్ను చెల్లించాలి.

స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ఇలా..

స్థిరాస్థి పెట్టుబ‌డుల (ఇల్లు,స్థ‌లాలు) కు 2 సంవ‌త్స‌రాలు మించితే దీర్ఘ‌కాల మూల‌ధ‌న ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. 

రెండేళ్ల కంటే త‌క్కువ చేస్తే స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న రాబ‌డిగా ప‌రిగ‌ణిస్తారు.

కింది ప‌ట్టిక‌లో ప‌న్ను విధానం వివ‌రంగా చూడ‌వ‌చ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని