FD చేయాలనుకుంటున్నారా?

డబ్బు నిర్వహణ  అంత సులభమేం కాదు. కష్టపడి సంపాదించిన సొమ్మును మరింత పెంచుకోవాలంటే సరైన మార్గంలో దానిని మదుపు చేయాలి. ...

Updated : 08 May 2021 10:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డబ్బు నిర్వహణ అంత సులభమేం కాదు. కష్టపడి సంపాదించిన సొమ్మును మరింత పెంచుకోవాలంటే సరైన మార్గంలో దానిని మదుపు చేయాలి. దీని కోసం రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్, బంగారం, స్థిరాస్తి కొనుగోలు ఇలా చాలాచోట్ల మదుపుపెట్టేవారున్నారు. అయితే ప్రతిచోటా ఎంతో కొంత రిస్కు మాత్రం ఉంటుంది. అలా కాకుండా స్థిర ఆదాయం పొందాలంటే ఫిక్స్‌ డిపాజిట్‌ ఓ చక్కని మార్గం. దీనిలో సేవింగ్స్‌ కంటే ఎక్కువ వడ్డీ సంపాదించొచ్చు. రిస్కు దాదాపు ఉండదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ రిజర్వు బ్యాంకు రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 4 శాతాన్నే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా బ్యాంకులు ఫిక్స్‌డిపాజిట్లపై వడ్డీ రేట్లను అనూహ్యంగా తగ్గించేశాయి.

రిస్కును భరించలేం అనుకునేవారు, పెన్షనర్లు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతారు. బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడంతో  వీరంతా చాలా వరకు ప్రభావితమయ్యారు. ఉద్యోగ విరమణ చేసిన చాలా మంది స్థిర ఆదాయం కోసం చేసిన ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది. అయితే.. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై దాదాపు 7 శాతం వడ్డీని అందిస్తున్నాయి. వాటిలో మదుపు చేసినట్లయితే మిగతా బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు.

1. యస్‌ బ్యాంక్‌- వార్షిక వడ్డీ రేటు 6.50శాతం
2. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు- వార్షిక వడ్డీరేటు 6.50 శాతం
3. డీసీబీ బ్యాంకు- వార్షిక వడ్డీ రేటు 6.70శాతం
4.సూర్యోదయ బ్యాంకు - వార్షిక వడ్డీ రేటు 6.75శాతం
5.జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు - వార్షిక వడ్డీ రేటు 7 శాతం

గమనిక: ఆయా బ్యాంకుల్లో మదుపు చేయాలనుకునేవారు నేరుగా బ్యాంకును సంప్రదించి, షరతులు తెలుసుకున్న తర్వాతనే పెట్టుబడి పెట్టగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని