ఈ ఏడాది ఐటీకి పండుగే

దేశీయ ఐటీ రంగానికి 2021 కలిసొస్తుందని, ఎక్కువ శాతం కంపెనీలు 7-9 శాతం వృద్ధి సాధిస్తాయని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ వి.బాలకృష్ణన్‌ అంచనా వేశారు. ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌

Published : 18 Jan 2021 00:39 IST

ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ వి.బాలకృష్ణన్‌

బెంగళూరు: దేశీయ ఐటీ రంగానికి 2021 కలిసొస్తుందని, ఎక్కువ శాతం కంపెనీలు 7-9 శాతం వృద్ధి సాధిస్తాయని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ వి.బాలకృష్ణన్‌ అంచనా వేశారు. ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌)కి అలవాటుపడటం, కొత్త వ్యాపార అవకాశాలను దక్కించుకోవడం ద్వారా కొవిడ్‌-19ను ఐటీ కంపెనీలు సమర్థంగా ఎదుర్కొన్నాయని అన్నారు. అన్ని దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు క్లౌడ్‌ పద్ధతికి వెళ్లడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాయని, అందువల్లే భారత కంపెనీలకు పెద్ద సంఖ్యలో భారీ ఒప్పందాలు వస్తున్నాయని వెల్లడించారు. ప్రతి 3-4 ఏళ్లకు ఒకసారి ఆర్థికంగా లేదా టెక్నాలజీ పరంగా పెద్ద మార్పులు వస్తున్నాయని తెలిపారు. ‘కొత్త టెక్నాలజీలు పుట్టుకురావడం లేదా పెద్ద దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వంటివి తలెత్తున్నాయి. ఐటీ కంపెనీలు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతూనే, అంకుర వ్యవస్థలతో కలిసిచేయాల్సి ఉంటుంద’ని బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని