
పర్సనల్, గోల్డ్ లోన్స్ vs టాప్-అప్ లోన్.. ఏది మేలు
సుమిత్ ఒక ఐటీ నిపుణుడు. బహుళ జాతి సంస్థలో గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి ఆదాయంలో వార్షికంగా వృద్ధి చెందుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి రుణం చెల్లిస్తున్నాడు. అయితే ఇంటిని ఆధునికరించేందుకు మరింత రుణం తీసుకోవాలనుకున్నాడు. దానికోసం వ్యక్తిగత రుణం లేదా బంగారంపై రుణానికి దాఖలు చేయాలనేది అతని ఆలోచన. అయితే ఆర్థిక నిపుణిడిని సంప్రదిస్తే టాప్-అప్ లోన్ తీసుకోమని సూచించాడు. మరి ఇతర రుణాల కంటే టాప్-అప్‌లోన్ తీసుకువడం మేలా? అయితే ఎందుకు?
టాప్-అప్ లోన్ అంటే..
టాప్ అప్ లోన్ పేరులో ఉన్నట్లు ఇప్పటికే రుణం తీసుకుని ఉండే దానిపై అదనంగా రుణం పొందటం. ఇదేలా సాధ్యం - ఒక సారి రుణం తీసుకున్నాక మళ్ళీ రుణం తీసుకుందాం అంటే కుదురుతుందా! అది మీ అవసరం బట్టి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రుణం తీసుకోవాలనుకుంటే మాత్రం టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గృహరుణానికి వర్తించే వడ్డీ రేటు ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా టాప్ అప్ లోన్ , పర్సనల్ లోన్ కంటే మేలే.
టాప్ అప్ లోన్ ఎలా ఇస్తారు..
దాదాపు అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని కలిపిస్తున్నాయి. గృహ రుణం చెల్లించడం మొదలైన 6 -12 నెలలకు టాప్ అప్ లోన్ తీసుకునేందుకు అవకాశం కలిపిస్తున్నాయి. ఇంటికి చాలా లోన్ తీసుకున్నాం కదా మళ్ళీ లోన్ కావాలంటే బ్యాంకులు ఇస్తాయా అనే సందేహం వస్తుంది. అయితే ఇక్కడ లాజిక్ గమనిస్తే మీకు విషయం వివరంగా అర్థమవుతుంది. ఇదెలా అంటే మొత్తం తీసుకున్న గృహరుణం నుంచి తగ్గిన రుణాన్ని తీసివేస్తే వచ్చే మొత్తానికి టాప్ అప్ లోన్ ఇస్తారు. అయితే ఈ కాలంలో సదరు వ్యక్తులకు ఆదాయం పెరగడం ద్వారా రుణ మొత్తం పరిమితి పెరుగుతుంది.
పరిగణలోకి తీసుకోవల్సిన ఇతర అంశాలు..
కాల పరిమితి:
మీ గృహరుణ కాలపరిమితిపై ఆధారపడి టాప్-ఆప్ లోన్ ఉంటుంది. వినియోగదారుని క్రెడిట్ ప్రొఫైల్, ప్రస్తుత రుణం వంటివి పరిశీలనలోకి వస్తాయి. సాధారణంగా ఇవి 20 ఏళ్ల వరకు ఉంటాయి. ఇతర వ్యక్తిగత రుణాలకు ఐదేళ్లు, పసిడి రుణాలకు మూడేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అందుకే ఇతర వాటితో పోలిస్తే టాప్-అప్‌లోన్ మేలైనది.
వడ్డీ రేటు:
టాప్-అప్ లోన్ వడ్డీరేట్లు సాధారణంగా గృహ రుణ వడ్డీతో పోలిస్తే 0.5-1 శాతం వరకు ఎక్కువగా ఉంటాయి. గృహ రుణ వడ్డీ రేట్లు వార్షికంగా 6.7శాతం నుంచి 10.2 శాతం వరకు ఉంటాయి. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా 10.65 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటాయి. పసిడి రుణాలపై వడ్డీ రేట్లు 9.24 శాతం నుంచి 26 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.
ప్రాసెసింగ్ టైమ్:
వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ రుణాలు, పసిడి రుణాలు తొందరగా లభిస్తాయి. వ్యక్తిగత రుణాలు దాఖలు చేసిన రెండో రోజుల్లోనే పొందవచ్చు, క్రెడిట్ కార్డ్, పసిడి రుణాలైతే వెంటనే ఇచ్చేస్తారు. అయితే టాప్-అప్ లోన్ పొందేందుకు మాత్రం వారం సమయం పడుతుంది. ఎందుకుంటే దాఖలు చేసుకున్న ఆస్తిని, దానిపై ఉన్న గృహ రుణాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది.
రుణ మొత్తం:
ఇంటికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలోనుంచి 75 శాతానికి మించి టాప్ అప్ రుణం అందించరు. అయితే వ్యక్తిగత రుణం రూ.40 లక్షల వరకు, బంగారంపై రుణాలు రూ.10 కోట్ల వరకు ఉంటాయి. ఇవి టాప్ అప్ రుణాల కంటే ఎక్కువ.
పన్ను మినహాయింపులు:
తీసుకున్న రుణం నుంచి ఎంత ఎక్కువగా ఇంటికి వినియోగిస్తే అంత పన్ను ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. సెక్షన్ 80 సీ కింద మొత్తం రుణంపై వడ్డీ చెల్లింపుపై కూడా మినహాయింపు ఉంటుంది.
టాప్-అప్ లోన్ వడ్డీ రేట్లు, కాలపరిమితి, పన్ను మినహాయింపులు అన్నింటితో ఇతర రుణాలకంటే మేలైనవి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టాప్-అప్ లోన్ అన్నది ఇదివరకే ఇంటి రుణం తీసుకొని కొన్ని నిర్థిష్టమైన వాయిదాలు చెల్లించనవారికే లభిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
South Africa: దక్షిణాఫ్రికా నైట్‌క్లబ్‌లో అనుమానాస్పద స్థితిలో 17 మంది మృతి
-
General News
Vijayawada: వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి
-
Politics News
Maharashtra Crisis: శివసైనికుల ఆందోళనలు.. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ భద్రత
-
Sports News
Umran Malik: ఉమ్రాన్ రాణిస్తున్నాడు.. ప్రపంచకప్ జట్టులో ఉండాలి : వెంగ్‌సర్కార్
-
General News
Weather Report: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
India News
Bypoll Results: రెండు లోక్‌సభ స్థానాల్లో ఉత్కంఠ.. భాజపా, ఎస్పీల మధ్య హోరాహోరీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్