Volkswagen : ఫోక్స్‌వేగన్‌ పోలో కొత్త వేరియంట్‌

జర్మనీకి చెందిన ఫోక్స్‌వేగన్‌ సంస్థ పోలో కారులో కంఫర్ట్‌లైన్‌ ట్రిమ్‌లో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్‌ను భారత్‌లో విడుల చేసింది.

Published : 03 Jun 2021 17:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జర్మనీకి చెందిన ఫోక్స్‌వేగన్‌ సంస్థ పోలో కారులో కంఫర్ట్‌లైన్‌ ట్రిమ్‌లో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.8.51లక్షలుగా నిర్ణయించింది. గతంలో ఆటోమేటిక్‌ ఆప్షన్‌ ప్రీమియం వేరియంట్లకు మాత్రమే ఉండేది. వాటి ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 9.45 లక్షలుగా ఉండేది. దానితో పోలిస్తే కొత్త వేరియంట్‌ ధర లక్షరూపాయలు చౌక. దీంతోపాటు ఈ సరికొత్త కారులో ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌,బ్లూపంక్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌ను అందిస్తోంది. 

ఫోక్స్‌వేగన్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ ఆశీష్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ పోలో ఫ్యామిలీలో కొత్త ట్రిమ్‌ను ప్రవేశపెట్టడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. మమ్మల్ని ప్రోత్సహించే కస్టమర్ల కోసం కంఫర్ట్‌లైన్‌ టీఎస్‌ఐ ఏటీని ప్రవేశపెట్టాము. ఈ సెగ్మెంట్‌లో పోలో బలమైన పోటీదారుగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇక ఈ కొత్తకారు ఇంజిన్‌లో ఎటుంటి మార్పులు లేవు. గతంలో వలే 1లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కొనసాగుతుంది. ఇది 109 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కొత్త కారు ఫ్లాష్‌ రెడ్‌, సన్‌సెట్‌ రెడ్‌,క్యాండీ వైట్‌, రిఫ్లెక్స్‌ సిల్వర్‌,కార్బన్‌ స్టీల్‌ రంగుల్లో లభిస్తుంది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని