పొదుపు ఖ‌తా Vs ఎఫ్‌డి Vs డెట్ ఫండ్స్‌ 

మూడు నుంచి నాలుగు నెల‌ల స్వల్ప కాల‌నికి ఎందులో పెట్టుబ‌డి పెట్టాలి. 

Updated : 01 Jul 2021 12:14 IST

కొన్ని సార్లు మ‌న‌కు అవ‌స‌ర‌మైన స‌మ‌యం కంటే కొద్ది నెల‌లు ముందుగానే పెద్ద‌మొత్తంలో డ‌బ్బు చేతికందుతుంది. కానీ మ‌నం దేనికోసమ‌యితే.. ఆ మొత్తాన్ని మ‌దుపు చేశామో.. ఆ ల‌క్ష్యానికి మూడు నుంచి ఆరు నెల‌ల స‌మ‌యం ఉంటుంది. అలాంట‌ప్పుడు ఆ మొత్తాన్ని ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలి.. అని చాలా మంది మ‌ద‌న‌ప‌డుతుంటారు. కొంద‌రు పొదుపు ఖాతాలో వేస్తే, ఇంకొంద‌రు బ్యాంకు ఎఫ్‌డీల‌కు ప్రాధాన్య‌మిస్తారు. మ‌రి కొంద‌రేమో డెట్ మ్యూచువల్ ఫండ్లలో లిక్విడ్ ఫండ్స్‌, అల్ట్రా షార్ట్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే ఇలా స్వ‌ల్ప కాలానికి పెట్టుబ‌డి ప‌ట్టే మార్గాలలో దేని ప్రాధాన్య‌త దానికే ఉంటుంది. 

1. బ్యాంకు పొదుపు ఖాతా:
స్వ‌ల్ప‌కాలానికి డ‌బ్బు ఉంచాల‌నుకున్న‌ప్పుడు ఎక్కువ మంది అనుస‌రించే మార్గం బ్యాంకు పొదుపు ఖాతా. ఇందులో స‌గ‌టున 3 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80టీటీఏ ప్ర‌కారం రూ.10వేల లోపు వ‌డ్డీ ఆదాయంపై  మిన‌హాయింపు ఉంటుంది. 

2. ఫిక్స్‌డ్ డిపాజిట్లు..
స్వ‌ల్ప‌కాల‌నికి పెట్టుబ‌డి పెట్టే వారు ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ)ల‌ను కూడా ఎంచుకోవ‌చ్చు. భారతీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 46 రోజుల నుంచి 179 రోజులు కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 3.90శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంది. ఎఫ్‌డీకి ప్రత్యామ్నాయంగా స్వీప్-ఇన్, స్వీప్-అవుట్ ఎఫ్‌డీల‌ను కూడా ఎంచుకోవ‌చ్చు. వీటిలో.. మీరు డబ్బు ఉంచే వ్యవధి ఆధారంగా బ్యాంక్ వడ్డీని అందిస్తుంది.

3. డెట్ ఫండ్లు:

లిక్విడ్ ఫండ్లు:
స్వ‌ల్ప‌కాలిక పెట్టుబ‌డుల‌కు మ‌రో మార్గం లిక్విడ్ ఫండ్లు, ఎఫ్‌డీల‌తో స‌మానంగా రాబ‌డి ఉంటుంది.  స‌గ‌టున 3.65శాతం రాబ‌డి ఉంటుంది. 

అల్ట్రా-షార్ట్ ట‌ర్మ్ ఫండ్స్:
స్వ‌ల్ప‌కాలానికి డ‌బ్బును మ‌దుపు చేసేందుకు మ‌రో ఉత్త‌మ మార్గం అల్ట్రా-షార్ట్ ట‌ర్మ్ ఫండ్స్, రూ.5 ల‌క్ష‌లు, అంత‌కంటే ఎక్కువ మొత్తాన్ని అల్ట్రా-షార్ట్ ట‌ర్మ్ ఫండ్స్‌లో ఉంచ‌డం మంచి ఎంపిక‌ని నిపుణులు  చెబుతున్నారు. అల్ట్రా-షార్ట్ ట‌ర్మ్ ఫండ్స్‌లో 3 నుంచి 6 నెలల మెచ్యూరిటీతో ఫోర్ట్‌ఫోలియోను నిర్వ‌హించ‌వ‌చ్చు. ఈ ఫండ్స్‌ సగటు రాబడి గత సంవత్సరంలో 5.35 శాతంగా ఉంది. ఎఫ్‌డీలతో పోలిస్తే రాబ‌డిలో 2 నుంచి 2.5 శాతం వ్య‌త్యాసం క‌నిపిస్తుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి, ఒక వ్య‌క్తి రూ.5 ల‌క్ష‌ల‌ను మూడు నెల‌ల కాలానికి, 5.35 శాతం వ‌డ్డీ రేటుతో పెట్టుబ‌డి పెడితే , అత‌నికి వ‌చ్చే రాబ‌డి రూ.6688. అదే మొత్తాన్ని 3.5 శాతం వ‌డ్డీ రేటుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వ‌చ్చే రాబ‌డి రూ.4375. రాబ‌డిలో వ్య‌త్యాసం రూ.2313. 

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో నిర్ణీత స‌మ‌యం కంటే ముందే డ‌బ్బు తీసుకునే వీలుండ‌దు. ఏదైనా అత్య‌వ‌స‌ర  ప‌రిస్థితుల‌లో ముంద‌స్తుగా తీసుకోవ‌ల‌సి వ‌చ్చిన లేదా ర‌ద్దు చేసుకున్న అద‌న‌పు రుసుములు చెల్లించాలి. కానీ డెట్ ఫండ్ల‌లో లిక్విడిటీ స‌మ‌స్య ఉండ‌దు. విత్‌డ్రా స‌మ‌యం గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. అంద‌వ‌ల్ల న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ తేదిపై స్ప‌ష్ట‌త లేనివారు, డెట్ ఫండ్లును ఎంచుకోవ‌డం మంచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని