Ex-gratia compensation: ఇకపై ఉద్యోగి మరణిస్తే.. పరిహారం ఎవరికంటే?

విధి నిర్వహణలో మరణించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే పరిహారాన్ని ఇకపై నామినీలకు ఇచ్చేలా ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది...

Published : 02 Oct 2021 20:38 IST

దిల్లీ: విధి నిర్వహణలో మరణించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే పరిహారం విషయంలో సర్కార్‌ స్వల్ప మార్పులు చేసింది. ఉద్యోగి బతికుండగా తన కుటుంబంలో ఎంపిక చేసిన నామినీ లేదా నామినీలకు ఇకపై పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు పరిహారం ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రత్యేక నిబంధనలేమీ లేకపోవడంతో.. సీసీఎస్‌ రూల్స్‌ ప్రకారం ‘ఎక్స్‌ట్రార్డినరీ పెన్షన్‌’కు అర్హులైన వారికి పరిహారాన్ని అందజేస్తూ వచ్చారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి డెత్‌ గ్రాట్యుటీ, జీపీఎఫ్‌ బ్యాలెన్స్‌, సీజీఈజీఐఎస్‌లన్నింటినీ కలిపి ఒకేసారి పరిహారం కింద చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

ఎవరినీ నామినేట్‌ చేయకపోతే..

ఉద్యోగి బతికుండగా ఎవరినీ నామినేట్‌ చేయకపోయినా.. లేదా నామినీ జీవించి లేకపోయినా.. పరిహారాన్ని కుటుంబసభ్యులందరికి సమానంగా పంచుతారు. సీసీఎస్‌(పెన్షన్‌) నిబంధనల్లో రూల్‌ 51 ప్రకారం.. గ్రాట్యుటీ విషయంలో అవలంబిస్తున్న విధానాన్నే దీనికీ వర్తింపజేస్తారు.

కుటుంబేతర వ్యక్తిని నామినీగా ఎంపిక చేయొచ్చా?

ఉద్యోగి ఎట్టిపరిస్థితుల్లో తన కుటుంబంతో సంబంధంలేని బయటి వ్యక్తిని నామినీగా ఎంపిక చేయడానికి వీలు లేదు. పరిహారాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే చెల్లిస్తారు. ఒకవేళ ఉద్యోగికి సొంత కుటుంబమంటూ లేకపోయినా.. బయటి వ్యక్తులను మాత్రం నామినేట్‌ చేయడానికి వీలు లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని