చెప్పులేసుకుంటే.. ₹లక్షల్లో జీతం!

కరోనా.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గడపదాటి బయటకు రాలేదు.

Updated : 31 Jan 2021 11:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గడపదాటి బయటకు రాలేదు. బయటకు వెళ్లేటప్పుడు వేసుకునే చెప్పుల కన్నా.. ఇంట్లో వేసుకునే చెప్పులే అరిగిపోయి ఉంటాయి. సోఫా షీట్లు, బెడ్‌ షీట్లు మాసిపోయి, హోమ్‌వేర్‌ దుస్తులు పాతబడిపోయి ఉంటాయి. వీటిని మారుస్తూ.. నచ్చినట్లు సొంతంగా డిజైన్‌ చేసే ఉంటారు. అలాంటి అనుభవం మీకు ఉన్నట్లయితే ‘బెడ్‌రూం అథ్లెటిక్స్‌’ కంపెనీ ఒక ఉద్యోగాన్ని ఆఫర్‌ చేస్తోంది. నెలలో కేవలం రెండు రోజులు పనిచేస్తే చాలు.. ఏడాదికి రూ.4లక్షల జీతం ఇస్తామంటోంది.

యూకేకు చెందిన ‘బెడ్‌రూం అథ్లెటిక్స్‌’ అనే సంస్థ ఇంట్లో వేసుకునే కంఫర్ట్‌ చెప్పులు, సోఫా షీట్లు, బెడ్‌షీట్లు, డోర్‌మ్యాట్లు తయారు చేస్తుంటుంది. కొత్త ఏడాదిలో ‘స్లిప్పర్‌ టెస్టర్‌’ను నియమించుకోవాలని నిర్ణయించింది. రెండు పోస్టులు ఉండగా.. ఒకటి పురుషులకు, మరొకటి మహిళలకు కేటాయించింది. సంస్థ తయారు చేసే చెప్పులు, ఇతర ఉత్పత్తులను ఎంపికైన ఉద్యోగులు వినియోగించి, పరిశీలించి ఎలా ఉన్నాయో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఉద్యోగి చేయాల్సిన పని. నెలలో రెండు రోజులు మాత్రమే ఈ పని ఉంటుంది. ఇందుకు గానూ సంస్థ ఏడాదికి రూ.4లక్షలు జీతంగా ఇవ్వనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 31లోపు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని