స్మాల్ క్యాప్ ఫండ్లలో పెట్టుబ‌డులు చేసేందుకు ఇది మంచి స‌మ‌యమేనా?

గ‌త ఐదేళ్లుగా లాభ‌ప‌డిన స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు గ‌త ఏడాది కాలంలో న‌ష్ట‌పోయాయి...........

Published : 21 Dec 2020 13:10 IST

గ‌త ఐదేళ్లుగా లాభ‌ప‌డిన స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు గ‌త ఏడాది కాలంలో న‌ష్ట‌పోయాయి.

1 నవంబర్ 2018 మధ్యాహ్నం 1:36

ప్ర‌స్తుతం మార్కెట్ల ఒడిదుడుకుల నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను చేసేందుకు,
ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో చేసేందుకు మంచి త‌రుణ‌మా కాదా అనే ఆలోచ‌న క‌ల‌గొచ్చు… దీనికి ఆర్థిక స‌ల‌హాదారులు చేసిన సూచనలు చూద్దాం. గ‌త 3-4 ఏళ్లుగా లాభ‌ప‌డిన ఈ సూచీ కొంత కాలంగా ప‌త‌న‌మ‌వ్వ‌డం చూడ‌వ‌చ్చు. ఇప్పటి వరకు ఇందులో లాభాలు మాత్రమే చుసిన మదుపరులకు స్మాల్ కాప్ ఫండ్ల గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇవి ఎంత పెరుగుతాయో అంతే నష్ట పోగలవు కూడా.

ఈ కేట‌గిరీలోకి వ‌చ్చే కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ల రాబ‌డుల వివ‌రాలు:

ఈ కేట‌గిరీకి చెందిన కొన్ని ఫండ్లు గ‌త ఐదేళ్ల‌లో ఇచ్చిన రాబ‌డి ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. గ‌త ఏడాది కాలంలో వ‌చ్చిన రాబ‌డి చాలా ప్ర‌తికూలంగా ఉంది.

smallcapfundsreturn.png

ఈ ప‌ట్టిక‌లో మ్యూచువ‌ల్ ఫండ్ల రాబ‌డి వివ‌రాల‌ను చూస్తే పెట్టుబ‌డి చేసేందుకు అనుకూలంగానే క‌నిపిస్తున్నాయి. అయితే మ‌దుప‌ర్లు స్మాల్ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకునే ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

న‌ష్ట‌భ‌యం అంచ‌నా వేసుకోవాలి:

స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు ఈ ఫండ్ల‌ను ఎంచుకునే ముందు త‌మ న‌ష్ట‌భ‌యాన్ని అంచ‌నా వేసుకోవాలి. స్మాల్ క్యాప్ సూచీ బాగా ప‌న‌త‌మైంది కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌దుపుచేస్తే రాబ‌డి క‌చ్చితంగా వ‌స్తుంద‌ని అనుకోవ‌ద్దు. ఇవి న‌ష్ట‌భ‌యం అధికంగా ఉండేవి కాబ‌ట్టి మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేసే ముందు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. ఈ ఫండ్లు మార్కెట్ ని బట్టి 20 నుంచి 30 శాతం రాబడి అందించగలవు, అలాగే అంతే మేరకు నష్టపోగలవు కూడా.

ఫండ్ల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి:

మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను చేసే ముందు ఎంచుకునే ఫండ్ రాబ‌డి వివ‌రాల‌ను చూసుకోవ‌డం మంచిది. ఎందుకంటే కేట‌గిరీ మొత్తం రాణించినా కొన్ని ఫండ్లు రాణించ‌క‌పోవ‌చ్చు. ఫండ్ మేనేజ‌రు ఎంపిక చేసుకునే షేర్ల పై రాబ‌డి ఆధార‌ప‌డి ఉంటుంది కాబ‌ట్టి మంచి ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవాలి.

ప‌రిమితంగానే కేటాయించాలి:

మ‌దుప‌ర్లు త‌మ మొత్తం పెట్టుబ‌డిలో 20 శాతం వ‌ర‌కూ మాత్ర‌మే స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో మ‌దుపుచేయాలి. అంత‌కంటే ఎక్కువ శాతం వీటిలో పెట్టుబ‌డి చేస్తే న‌ష్ట‌భ‌యం పెరిగి మొత్తం పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం చూపేందుకు అవ‌కాశం ఉంటుంది. న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉన్న మ‌దుప‌ర్లు వీటిలో మ‌దుపు చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని