నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Updated : 01 Feb 2021 11:08 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌ కాగితరహితంగా రూపొందించారు. ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతుల ముద్రణ చేపట్టలేదు. దీంతో.. నిర్మలమ్మ చేతిలో సంప్రదాయ బాహి ఖాటాకు బదులు మేడిన్‌ ఇండియా ట్యాబ్‌ కన్పించింది. గతంలో బడ్జెట్‌ కాపీలను ఆర్థిక మంత్రులు లెదర్‌ సూట్‌కేసులు పట్టుకొచ్చేవారు. అయితే 2019, 2020లో నిర్మలా సీతారామన్‌ మాత్రం సంప్రదాయ బాహీ ఖాటా (వస్త్రం లాంటి సంచి)లో బడ్జెట్‌ పత్రాలు తీసుకొచ్చారు. 

ఇవీ చదవండి...

బడ్జెట్‌ ‘ట్యాబ్‌‌‌’తో నిర్మలమ్మ

స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ జోష్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని