బైబ్యాక్‌ ప్రకటించిన గెయిల్‌

ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో 6,97,56,641 షేర్లను  తిరిగి కొనుగోలు చేయనుంది

Published : 15 Jan 2021 22:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో 6,97,56,641 షేర్లను  తిరిగి కొనుగోలు చేయనుంది. షేరుకు రూ.150 చొప్పున చెల్లించేందుకు రూ.1,046.35 కోట్లను వెచ్చించనుంది. ఈ విషయాన్ని గెయిల్‌ ప్రకటించింది. గెయిల్‌ బోర్డు మధ్యంతర డెవిడెండ్‌ను కూడా ప్రకటించింది. ఒక్కోషేరుకు రూ.2.50 చొప్పున చెల్లించనుంది.

ఈ బైబ్యాక్‌, డెవిడెండ్‌కు సంబంధించిన రికార్డ్‌ తేదీని జనవరి 28న నిర్ణయిస్తామని తెలిపింది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలను షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించాలని కోరింది. ఆ సంస్థల్లో కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎండీసీ వంటి దిగ్గజాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు షేర్లను బైబ్యాక్‌ చేస్తే ద్రవ్యలోటు తగ్గించుకొనేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.  కంపెనీలు వివిధ  కారణాలతో బైబ్యాక్‌లు చేపడతాయి. ఓపెన్‌ మార్కెట్లో తక్కువ షేర్లు సహజంగానే డిమాండ్‌ పెరిగి.. కంపెనీ మార్కెట్‌ విలువ వృద్ధి చెందుతుంది. దీంతోపాటు అదనపు నిధులను వాటాదారులకు అందజేసే అవకాశం లభిస్తుంది.

ఇవీ చదవండి

మళ్లీ కొరడా తీసిన ట్రంప్‌..!

14శాతం విక్రయాలు ఆన్‌లైన్‌లోనే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని