సంక్షిప్త వార్తలు (2)
రూ.2 కోట్ల లోపు, ఎంపిక చేసిన కాలావధి గల దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 0.25% పెంచింది. కొత్తరేట్లు నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి.
బీఓబీ డిపాజిట్ రేట్లు 0.25% పెంపు
దిల్లీ: రూ.2 కోట్ల లోపు, ఎంపిక చేసిన కాలావధి గల దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 0.25% పెంచింది. కొత్తరేట్లు నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్‌తో పాటు బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (నాన్-కాలబుల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకం)పైనా వడ్డీ రేట్లను పెంచింది. 3-5 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లకు 6.5% వడ్డీ ఇవ్వనుంది. సీనియర్ సిటిజన్లకు ఇది 7.15 శాతంగా ఉంటుంది. 5-10 ఏళ్ల డిపాజిట్లపై కొత్త రేటు 6.5% కాగా, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం.
బ్యాంకింగ్ ఫండ్లకు వారంలో 6% నష్టం
దిల్లీ: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు దివాలా తీసిన ప్రభావం, మన దేశ బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్‌లపైనా పడింది. గత వారంలో ఈ ఫండ్‌లు 6 శాతం వరకు నష్టపోయాయి. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో, దేశీయంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంపై మదుపర్ల సెంటిమెంటు బలహీనపడింది. ఈ రంగ షేర్లు గత వారం 3-13% వరకు నష్టపోయాయి. బ్యాంకింగ్ షేర్లలో తీవ్ర అమ్మకాల నేపథ్యంలో, ఈ విభాగంలోని 16 పథకాల ఫండ్‌ల స్వల్ప కాలిక పనితీరు బలహీనపడింది. మార్చి 17తో ముగిసిన వారానికి ఈ ఫండ్‌లలో 1.6-6% నష్టం వాటిల్లిందని ఏస్ ఎంఎఫ్ నెక్ట్స్ విశ్లేషించింది. ఈ ఏడాదిలో చూస్తే ఇప్పటివరకు ఈ ఫండ్‌లు 8-10% ప్రతికూల ప్రతిఫలాలు అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
5 శాతానికి పైగా నష్టపోయిన ఎంఎఫ్‌లు
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్‌ఐసీ ఎంఎఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్
దీర్ఘకాలంలో బాగున్నాయ్: అయితే 9 నెలలు, ఒక ఏడాది కాల వ్యవధి ప్రకారం చూస్తే, ఈ ఫండ్‌ల ప్రతిఫలాలు సానుకూలంగా ఉన్నాయి. అన్ని బ్యాంకింగ్, ఆర్థిక సేవల ఫండ్‌లు వరుసగా 20 శాతం, 12 శాతం లాభాల్ని మదుపర్లకు పంచాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
-
Ap-top-news News
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
-
Crime News
Vizag: విశాఖ జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి