అమెరికా షేర్లలో మదుపు...

విదేశీ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలను ఇటీవల కాలంలో పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కల్పిస్తున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను ఆవిష్కరిస్తున్నాయి. ఇదే కోవలో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ...

Published : 05 Mar 2021 01:29 IST

విదేశీ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలను ఇటీవల కాలంలో పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కల్పిస్తున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను ఆవిష్కరిస్తున్నాయి. ఇదే కోవలో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ యూఎస్‌లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. యూఎస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌బీఐ ఎంఎఫ్‌ తీసుకువచ్చిన తొలి ఫండ్‌ కూడా ఇదే కావటం గమనార్హం. అదే ‘ఎస్‌బీఐ ఇంటర్నేషనల్‌ యాక్సెస్‌- యూఎస్‌ ఈక్విటీ ఎఫ్‌ఓఎఫ్‌’
ఇది ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌. అంటే యూఎస్‌లోని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 15న ముగుస్తుంది. దీనికి మొహిత్‌ జైన్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.
‘ఎస్‌బీఐ ఇంటర్నేషనల్‌ యాక్సెస్‌- యూఎస్‌ ఈక్విటీ ఎఫ్‌ఓఎఫ్‌’, యూఎస్‌లో తన పెట్టుబడుల భాగస్వామిగా (అండర్‌లైయింగ్‌ స్కీమ్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) ఆముండి ఫండ్స్‌- యూఎస్‌ పయనీర్‌ ఫండ్‌ను ఎంచుకుంది. అంటే మనదేశంలోని ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన సొమ్మును యూఎస్‌ పయనీర్‌ ఫండ్‌ ద్వారా యూఎస్‌ ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతుందన్నమాట. ఈ ‘అండర్‌లైయింగ్‌ స్కీమ్‌’ పెట్టుబడులు ప్రస్తుతం ప్రధానంగా మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌.కామ్‌, వీసా, అనలాగ్‌ డివైసెస్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రెన్సెస్‌, ఎలాంకో ఆనిమల్‌ హెల్త్‌, మాస్టర్‌కార్డ్‌, ష్లంబెర్గర్‌ షేర్లలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని