
వెండి ఆకర్షణీయం!
కమొడిటీస్ ఈ వారం
బంగారం
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం మరింత లాభపడే అవకాశం ఉంది. రూ.47,301 కంటే దిగువకు చేరితే మాత్రం బలహీనపడొచ్చు. సాంకేతికంగా రూ.47,388 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఇది కోల్పోతే రూ.46,998 వరకు పడిపోవచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.48,080, ఆ తర్వాత రూ.48,382 స్థాయిని పరీక్షించొచ్చు. ధర తగ్గినపుడల్లా కొనుగోలు చేయడం మంచి వ్యూహమవుతుంది.
* ఎంసీఎక్స్ బుల్‌డెక్స్ జనవరి కాంట్రాక్టు రూ.13,910 కంటే దిగువన కదలాడకుంటే.. రూ.14,159; రూ.14,266 వరకు రాణించొచ్చు..
వెండి ఫిబ్రవరి కాంట్రాక్టు రూ.60,469 ఎగువన ఉన్నంత వరకు సానుకూలంగానే కదలాడొచ్చు. ఈ వారం రూ.62,019 కంటే పైన కదలాడితే రూ.62,606; రూ.63,561 వరకు పెరగొచ్చు. దీర్ఘకాలానికి రూ.59881- 60,479 మధ్య లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు.
ప్రాథమిక లోహాలు
* ఎంసీఎక్స్ మెటల్‌డెక్స్ ఫిబ్రవరి కాంట్రాక్టు రూ.17,301 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే మరింతగా పెరగొచ్చు.
* రాగి జనవరి కాంట్రాక్టు రూ.730 దిగువన ముగిస్తే బలహీనపడే అవకాశం ఉంది. లేకుంటే కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు.
* సీసం జనవరి కాంట్రాక్టు రూ.184.30 ఎగువన ట్రేడైనంత వరకు లాభాలు కొనసాగేందుకు అవకాశం ఉంది.
* జింక్ జనవరి కాంట్రాక్టు రూ.283.85 కంటే కిందకు వెళ్లకుంటే.. సానుకూల ధోరణిలో కదలాడొచ్చు. అందువల్ల స్టాప్‌లాస్‌ను సవరించుకుని రూ.292; రూ.294 లక్ష్యాలతో లాంగ్ పొజిషన్లు కొనసాగించవచ్చు. ఒకవేళ రూ.283 దిగువకు వస్తే షార్ట్ సెల్లింగ్ ఉత్తమం. ఇప్పటికే షార్ట్ సెల్ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.291కి స్టాప్‌లాస్‌ను సవరించుకోవాలి.
* అల్యూమినియం జనవరి కాంట్రాక్టు రూ.230.25 పైన కొనసాగినంత వరకు లాంగ్ పొజిషన్లు అట్టిపెట్టుకోవచ్చు. రూ.231 స్థాయికి వస్తే కొనుగోళ్లకు మొగ్గుచూపడం మంచిదే.
* నికెల్ జనవరి కాంట్రాక్టు రూ.1,641 కంటే ఎగువన ట్రేడయితే రూ.1674 వరకు పెరిగే అవకాశం ఉంది. రూ.1616కు తగ్గితే, రూ.1598 వరకు వెళ్లొచ్చు.
ఇంధన రంగం
* సహజవాయువు జనవరి కాంట్రాక్టుకు రూ.287 ఎగువన కొనుగోళ్లు కొనసాగొచ్చు. రూ.287 వద్ద మద్దతు, రూ.336 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. రూ.274 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని, రూ.288- 301 మధ్య పొజిషన్లు తీసుకోవచ్చు.
* ముడి చమురు జనవరి కాంట్రాక్టు రూ.5,969 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కిందకు వెళితే రూ.5892; రూ.5748 వరకు దిద్దుబాటు కావొచ్చు.
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు ఏప్రిల్ కాంట్రాక్టు రూ.10,817 కంటే పైకి వెళ్లకుంటే రూ.10,011; రూ.9,758 వరకు దిగిరావచ్చు. ఒకవేళ పైకి వెళ్తే రూ.10,971 దగ్గర నిరోధం ఎదురుకావొచ్చు.
* జీలకర్ర ఏప్రిల్ కాంట్రాక్టు రూ.18,598 కంటే ఎగువన కదలాడకుంటే.. పడే అవకాశం ఉంది. అందువల్ల రూ.18,598 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని, రూ.17,598 లక్ష్యంతో లాభాలు స్వీకరించొచ్చు.
* పత్తి జనవరి కాంట్రాక్టుకు రూ.36,990 వద్ద నిరోధం కనిపిస్తోంది. రూ.34,860 దిగువన అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు.
- ఆర్ఎల్పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
పసిడి దిగుమతులు రెండింతలు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- డిసెంబరు మధ్య దేశంలోకి దిగుమతి అయిన పసిడి విలువ 38 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.85 లక్షల కోట్లు)కు చేరింది. 2020 ఏప్రిల్- డిసెంబరు నాటి దిగుమతులు 16.78 బిలియన్ డాలర్లతో పోలిస్తే, ఈసారి రెట్టింపు కన్నా అధికమయ్యాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు 762 మి.డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫలితంగా వాణిజ్యలోటు 61.38 బి.డాలర్ల నుంచి 142.44 బి.డాలర్లకు పెరిగింది. డిసెంబరులో పసిడి దిగుమతులు 4.8 శాతం పెరిగి 4.5 బిలియన్ డాలర్లకు చేరాయి.