
‘ ఓలా డ్యాష్’గా మారిన ఓలా స్టోర్
దిల్లీ: నిత్యావసరాలను వేగంగా డెలివరీ చేసే వ్యాపార విభాగం పేరును ‘ఓలా డ్యాష్’గా మారుస్తున్నట్లు ఓలా వర్గాలు తెలిపాయి. గతేడాది ఈ సేవలను ‘ఓలా స్టోర్’ పేరిట ఓలా ప్రారంభించింది. తాజా పరిణామంపై ఓలా అధికారికంగా స్పందించలేదు. నిత్యావసరాల డెలివరీ వ్యాపారం కోసం ఓలా రూ.250 కోట్ల మూలధనం సిద్ధం చేసుకుంది. 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15000 కోట్ల) ఐపీఓ కంటే ముందే విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆరు నగరాలు- దిల్లీ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, పుణె, చెన్నైల్లో ఈ వ్యాపార కార్యకలాపాలు విస్తరించగా.. 100కు పైగా డార్క్ స్టోర్ల నుంచి రోజుకు 6000- 8000 ఆర్డర్లు లభిస్తున్నట్లు సమాచారం. ఈ విభాగంలో ప్రయోగాలు చేయడం ఓలాకు ఇది మూడోసారి. 2015 జులైలో బెంగళూరులో ఓలా ఆన్‌లైన్ గ్రోసరీ స్టోర్‌ను ప్రారంభించింది. అదే ఏడాది ఆహార డెలివరీ యాప్‌ను తీసుకొచ్చింది. ఓలా ఆన్‌లైన్ స్టోర్, ఓలా ఫుడ్స్‌ను ప్రారంభించిన 9 నెలల్లోపే మూసేసింది. అమెరికా దిగ్గజ సంస్థ ‘డోర్‌డ్యాష్’కు దగ్గరగా కొత్త పేరు ఓలా డ్యాష్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. డోర్‌డ్యాష్‌కు 26 బి.డాలర్ల మార్కెట్ విలువ ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.