రోగ నిర్ధారణ పరీక్షలకు డ్రోన్‌ సహకారం

మారుమూల ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో రోగ నిర్ధారణ కోసం వ్యాధిగ్రస్తుల వద్ద రక్తనమూనాల వంటివి సేకరించినా, వాటిని నగరాల్లోని పెద్ద డయాగ్నోస్టిక్‌ కేంద్రాలకు పంపి, ఫలితాలు తెలుసుకునేందుకు ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యాన్ని

Published : 09 Feb 2022 02:55 IST

మారుమూల ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో రోగ నిర్ధారణ కోసం వ్యాధిగ్రస్తుల వద్ద రక్తనమూనాల వంటివి సేకరించినా, వాటిని నగరాల్లోని పెద్ద డయాగ్నోస్టిక్‌ కేంద్రాలకు పంపి, ఫలితాలు తెలుసుకునేందుకు ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యాన్ని తగ్గించేలా ‘సేకరించిన నమూనాల’ను డ్రోన్ల ద్వారా రవాణా చేసేందుకు డ్రోన్‌ డెలివరీ లాజిస్టిక్స్‌ స్కై ఎయిర్‌ మొబిలిటీ, రెడ్‌క్లిఫ్‌ ల్యాబ్స్‌ మధ్య దీర్ఘకాల ఒప్పందం కుదిరింది.  నోయిడాలోని రెడ్‌క్లిఫ్‌ ల్యాబ్‌ నేషనల్‌ రిఫరెన్స్‌ ల్యాబ్‌ నుంచి 30-40 ప్రయోగాత్మక పరీక్షలు జరిపాక, వాణిజ్య సేవలు ప్రారంభించనున్నట్లు స్కైఎయిర్‌ మొబిలిటీ సహవ్యవస్థాపకుడు స్వప్నిక్‌ జక్కంపూడి తెలిపారు. ఇందువల్ల సురక్షితంగా, వేగంగా, తక్కువ ధరలో రోగ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు వీలవుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని