Valentines day: ప్రేమికుల రోజుకు ఫ్లోరియో ఆభరణాలు: రిలయన్స్‌ జువెల్స్‌

పసిడి ఆభరణాల సంస్థ రిలయన్స్‌ జువెల్స్‌ ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రత్యేక కలెక్షన్‌ ‘ఫ్లోరియో’ను ఆవిష్కరించింది. మొక్కలు, పూలను ప్రేరణగా తీసుకుని, రోజురోజుకు....

Updated : 14 Feb 2022 07:33 IST

హైదరాబాద్‌: పసిడి ఆభరణాల సంస్థ రిలయన్స్‌ జువెల్స్‌ ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రత్యేక కలెక్షన్‌ ‘ఫ్లోరియో’ను ఆవిష్కరించింది. మొక్కలు, పూలను ప్రేరణగా తీసుకుని, రోజురోజుకు ప్రేమ వృద్ధి చెందుతుందనే భావనతో ఈ ఆభరణాల డిజైన్‌లను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. రోజ్‌ గోల్డ్‌, ఎల్లో గోల్డ్‌ల్లో రింగులు, పెండెంట్లుగా ఫ్లోరియో డిజైన్‌లు లభిస్తాయి. వీటి ప్రారంభ ధర రూ.12,000.  డ్రీమ్‌ డైమండ్‌ సేల్‌ పేరిట ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈనెల 28 వరకు ఉండే ఈ ఆఫర్‌లో భాగంగా రిలయన్స్‌ జువెల్స్‌లో కొనుగోలు చేసే డైమండ్‌ ఆభరణాలపై ఇన్‌వాయిస్‌ విలువలో 25 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 25 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ‘ఫ్లోరియో’ కలెక్షన్‌ దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్‌ జువెల్స్‌ విక్రయశాలల్లో లభిస్తాయి. ఎంపిక చేసిన ఆభరణాలను రిలయన్స్‌ జువెల్స్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని