పిట్టీ ఇంజినీరింగ్‌ తుది డివిడెండ్‌ 17 శాతం

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే పిట్టీ ఇంజినీరింగ్‌ మార్చి త్రైమాసికానికి రూ.286.46 కోట్ల స్టాండలోన్‌ మొత్తం ఆదాయంపై రూ.20.01 కోట్ల నికరలాభాన్ని

Published : 24 May 2022 02:54 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే పిట్టీ ఇంజినీరింగ్‌ మార్చి త్రైమాసికానికి రూ.286.46 కోట్ల స్టాండలోన్‌ మొత్తం ఆదాయంపై రూ.20.01 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.189.52 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.21.21 కోట్ల లాభాన్ని సంస్థ ఆర్జించింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 970.26 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.51.89 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21లో రూ.538.66 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.28.79 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.0.85 చొప్పున (17 శాతం) తుది డివిడెండ్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని