నిధుల సమీకరణలో మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌

మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ మూలధన  నిధులు సమీకరించే యత్నాల్లో నిమగ్నమైంది. ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనున్నట్లు మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ బీఎస్‌ఈకి తెలియజేసింది. దీని కోసం వచ్చే నెల 4న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశాన్ని ఏర్పాటు

Published : 01 Jul 2022 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ మూలధన  నిధులు సమీకరించే యత్నాల్లో నిమగ్నమైంది. ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనున్నట్లు మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ బీఎస్‌ఈకి తెలియజేసింది. దీని కోసం వచ్చే నెల 4న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏ విధంగా, ఎంత మొత్తం నిధుల సమీకరించాలి..., సంబంధిత అంశాలను సమావేశంలో ఖరారు చేస్తారు. ఈ కంపెనీ  ఎంబెడెడ్‌ టెక్నాలజీస్‌, సెమీకండక్టర్‌ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని