‘లెమ్మీ బీ’ కి రూ.13.5 కోట్ల నిధులు

హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ- ‘లెమ్మీ బీ’కి రూ.13.5 కోట్ల నిధులు లభించాయి. ఇందులో రూ.11.5 కోట్లు ఈక్విటీ మూలధనం కాగా, రూ.2 కోట్లు అప్పుగా సమకూరింది. పెట్టుబడి సంస్థలైన మల్టిప్లై వెంచర్స్‌, వామి కేపిటల్‌, సత్వ ఫ్యామిలీ ఆఫీస్‌, అనికట్‌ కేపిటల్‌

Published : 01 Jul 2022 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ- ‘లెమ్మీ బీ’కి రూ.13.5 కోట్ల నిధులు లభించాయి. ఇందులో రూ.11.5 కోట్లు ఈక్విటీ మూలధనం కాగా, రూ.2 కోట్లు అప్పుగా సమకూరింది. పెట్టుబడి సంస్థలైన మల్టిప్లై వెంచర్స్‌, వామి కేపిటల్‌, సత్వ ఫ్యామిలీ ఆఫీస్‌, అనికట్‌ కేపిటల్‌ ఏఐఎఫ్‌, గ్రిప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈక్విటీ మూలధనాన్ని అందించాయి. వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు ‘లెమ్మీ బీ’ వెల్లడించింది. అంతేగాక దుబాయ్‌, యూఎస్‌, ఆస్ట్రేలియా దేశాలకు విస్తరించనున్నట్లు, కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని