క్రమం తప్పని ఆదాయం..

వివిధ దశల్లో ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తట్టుకునేందుకు వీలుగా బీమా రక్షణ, పొదుపు కలిసి ఉండే పాలసీని ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తెచ్చింది. మూడేళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారి

Published : 21 May 2021 01:17 IST

వివిధ దశల్లో ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తట్టుకునేందుకు వీలుగా బీమా రక్షణ, పొదుపు కలిసి ఉండే పాలసీని ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తెచ్చింది. మూడేళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకూ ఈ పాలసీని ఎంచుకునేందుకు అర్హులు. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ. రెండు రకాలుగా అందుబాటులో ఉంది.
‘ఇన్‌కం’ ఐచ్ఛికాన్ని ఎంచుకున్నప్పుడు.. 6 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 ఏళ్ల దాకా హామీతో కూడిన ఆదాయాన్ని అందుకోవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత.. పాలసీదారుడికి చెల్లించిన ప్రీమియం మొత్తం చేతికి అందుతుంది. క్రమం తప్పకుండా అదనపు ఆదాయం రావాలని కోరుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లల చదువులు, వారి వివాహంలాంటి ఖర్చులను తట్టుకునేందుకు ఇది సహాయపడుతుంది.
‘లంప్‌ సమ్‌’లో ఆరేళ్ల ప్రీమియం చెల్లించిన తర్వాత.. మెచ్యూరిటీ బెనిఫిట్‌ కింద ఏకమొత్తంలో చెల్లింపు అందిస్తారు. మొత్తం పాలసీ వ్యవధి అంతా జీవిత బీమా రక్షణ కొనసాగుతుంది. ఈ పాలసీలో చేరాలనుకునే వారికి కనీస వయసు 11 ఏళ్లు ఉండాలి. పొదుపుతో పాటు జీవిత బీమా రక్షణ అందించేలా ఈ పాలసీని రూపొందించినట్లు ఎక్సైడ్‌ లైఫ్‌  ఇన్సూరెన్స్‌ అంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని