అన్ని రకాల కంపెనీల్లో...

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మల్టీ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 26. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. అందువల్ల ఎన్‌ఎఫ్‌ఓ తర్వాత తిరిగి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయి.

Updated : 12 Nov 2021 06:09 IST

డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మల్టీ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 26. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. అందువల్ల ఎన్‌ఎఫ్‌ఓ తర్వాత తిరిగి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయి. పెద్ద, చిన్న, మధ్య స్థాయి కంపెనీలన్నింటిలో పెట్టుబడి పెట్టే సౌకర్యం ఉండటం మల్టీక్యాప్‌ ఫండ్లకు ఉన్న ప్రధాన ఆకర్షణ. ఇటీవల కాలంలో ఈ ఫండ్లకు మదుపరుల ఆదరణ అధికంగా కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి ఫండ్‌ మేనేజర్‌గా డేలిన్‌ పింటో వ్యవహరిస్తారు. నిఫ్టీ 500 మల్టీక్యాప్‌ 50:25:25 ఇండెక్స్‌ తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. నిఫ్టీ 500 మల్టీక్యాప్‌ 50:25:25 ఇండెక్స్‌ గత 11 ఏళ్లలో ఏటా సగటున 12 శాతం ప్రతిఫలాన్ని నమోదు చేసింది. ఫండ్‌ మేనేజర్‌ సామర్థ్యాన్ని బట్టి మల్టీ క్యాప్‌ ఫండ్లలో ఇంకా అధిక ప్రతిఫలం లభించే అవకాశమూ ఉంది.


పది దేశాల్లో మదుపు...

మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, 10 దేశాల్లోని స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎంఎస్‌సీఐ ఈఏఎఫ్‌ఈ టాప్‌ 100 సెలెక్ట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’, అనే ఈ పథకం ఎంఎస్‌సీఐ ఈఏఎఫ్‌ఈ (యూరప్‌, ఆస్ట్రేలియా, దూర ప్రాచ్యం) ఇండెక్స్‌లో ఉన్న దేశాల్లోని స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టటం ద్వారా మదుపరులకు అధిక ప్రతిఫలాన్ని ఆర్జించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ దేశాల్లోని ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, కన్సూమర్‌ స్టేపుల్స్‌, ఐటీ, పారిశ్రామిక రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 25న ముగుస్తుంది. మనదేశంలో పెట్టుబడులకే పరిమితం కాకుండా, దేశం వెలుపల... ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఫండ్‌ వీలు కల్పిస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ నవీన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం మనదేశం నుంచి అధికంగా యూఎస్‌, కెనడా దేశాల్లో ఈక్విటీ పెట్టుబడులు పెడుతున్న వైనం కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఐరోపా, దూర ప్రాచ్యం, ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం మన దేశంలోని మదుపరులకు ఈ ఫండ్‌ వీలుకల్పిస్తుందని అన్నారు. ఐషేర్స్‌ కోర్‌ ఎంఎస్‌సీఐ ఈఏఎఫ్‌ఈ ఈటీఎఫ్‌ (డెవలప్డ్‌ మార్కెట్‌, ఎక్స్‌క్లూడింగ్‌ యూఎస్‌) ఈ పథకానికి అండర్‌లైయింగ్‌ ఇండెక్స్‌గా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని