Updated : 28 Jan 2022 04:24 IST

మైనర్‌ పేరిట మదుపు చేస్తున్నారా?

పిల్లలకు ఆర్థిక రక్షణ కల్పించడం.. తల్లిదండ్రుల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ¨డబ్బు, చదువు, ఆరోగ్యం, ఇతర విషయాల్లో ఎలాంటి లోటూ పిల్లలకు ఉండకూడదనే ఆరాటం ప్రతి ఒక్కరిలోనూ చూస్తుంటాం. దీన్ని సాధించేందుకు పిల్లల కోసం మదుపు చేసేందుకు చాలామంది ముందుకు వస్తుంటారు. మరి, మైనర్ల పేరిట పెట్టుబడులు పెట్టాలంటే ఏం చేయాలి?  తెలుసుకుందాం.

పెట్టుబడులు ఎప్పుడూ ఆర్జించే వ్యక్తుల పేరుమీదే ఉండాలి. కానీ, కొంతమంది తమ పిల్లలకు పలు సందర్భాల్లో వచ్చిన నగదు బహుమతులను ఏదో ఒక రూపంలో మదుపు చేయాలని ప్రయత్నిస్తుంటారు. భారతీయ చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్నవారిని మైనర్లుగా పేర్కొంటారని తెలిసిందే. పిల్లల పేరిట బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్‌ తదితర ఖాతాలు ప్రారంభించి, సులభంగా మదుపు చేయడం సాధ్యం కాదు. దీనికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మైనర్ల హక్కులు కాపాడేందుకు వారి పేరుమీద చేసే పెట్టుబడులకు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు.


* పిల్లలు పెట్టుబడి నిర్ణయాలను సొంతంగా తీసుకోలేరు. వారికి అంత అవగాహనా ఉండదు. కాబట్టి, ఒక సంరక్షకుడు వారి పెట్టుబడులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. సహజంగా తల్లిదండ్రులు ఈ బాధ్యత నిర్వహిస్తారు. కొన్నిసార్లు న్యాయస్థానాలు ప్రత్యేకంగా పిల్లల కోసం సంరక్షకుడిని నియమించే అవకాశం ఉంది.

* పెట్టుబడులు పెట్టేందుకు పిల్లల పుట్టిన తేదీ ధ్రువీకరణ తప్పనిసరిగా అవసరం. దీంతోపాటు, సంరక్షకుడికి, పిల్లలకు ఉన్న బంధుత్వాన్ని నిరూపించే పత్రాలూ కావాలి.

* సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు, పాన్‌ అవసరం అవుతాయి. మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

* పెట్టుబడులకు సంబంధించిన చెల్లింపులన్నీ సంరక్షుడిగా ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచే వెళ్తాయి.

* ఆయా పెట్టుబడి పథకాలకు సంబంధించిన యజమాని మాత్రం మైనరే అవుతారు.

* మైనర్‌ పేరిట ఖాతాను ఉమ్మడిగా ప్రారంభించడం కుదరదు. ఈ ఖాతాలకు నామినీ పేరూ పేర్కొనలేరు.


మేజర్‌గా మారితే...

* పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత పాన్‌తోపాటు, మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) పత్రాలను సమర్పించాలి.

* పిల్లల సంతకాన్ని బ్యాంకు ద్వారా అటెస్ట్‌ చేయించాలి. దాన్ని ఖాతాలున్న బ్యాంకులు, డీమ్యాట్‌ సంస్థల్లో అందించాలి. సంరక్షకుడి సంతకం స్థానంలో దీన్ని వాడతారు.

* అప్పటి వరకూ మైనర్‌ పేరిట ఉన్న ఖాతాలు.. ఇక నుంచి కొత్త ఖాతాలుగా మారతాయి. మేజర్‌ అయిన పిల్లలు తమ ఖాతాలు సొంతంగా నిర్వహించుకునేందుకు వీలుంటుంది.


పెట్టుబడుల విషయంలో..

మైనర్‌ పేరిట షేర్లలో మదుపు చేయొచ్చు. కేవలం షేర్లలో డెలివరీ ఆధారిత క్రయవిక్రయాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇంట్రాడే, ఎఫ్‌అండ్‌ఓ, కరెన్సీ డెరివేటివ్స్‌లాంటివి అనుమతించరు. ఒకసారి మేజర్‌ అయిన తర్వాత మైనర్‌ ఖాతా రద్దు చేసి, కొత్త ఖాతా ప్రారంభించాలి. అప్పటివరకూ మైనర్‌ ఖాతాలో ఉన్న షేర్లు, కొత్తగా ప్రారంభించిన ఖాతాలోకి బదిలీ అవుతాయి. మ్యూచువల్‌ ఫండ్లలోనూ మైనర్ల పేరిట పెట్టుబడులు పెట్టే వీలుంది.

ఇది కాకుండా, మైనర్ల పేరుమీద సార్వభౌమ పసిడి పథకాలు (ఎస్‌జీబీ), స్థిరాస్తి, పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన (10 ఏళ్లలోపు బాలికల కోసం) పథకాల్లోనూ మదుపు చేయొచ్చు. 

 - గ్రో.ఇన్‌

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని