Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?

Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

Published : 15 Jun 2024 00:16 IST

Gold and silver prices | పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..

బంగారం గురించి..

  • బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 carat Gold ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్‌ (Gold Coins), బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది.
  • నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది.
  • బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది.
  • కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది.
  • కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్‌టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని