Google Pay: భారత్‌ వెలుపలా యూపీఐ.. NPCIతో గూగుల్‌పే ఒప్పందం

Google Pay: భారత్‌ వెలుపలా యూపీఐ సేవల్ని అందించాలనే ఉద్దేశంతో నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌తో గూగుల్‌పే ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 17 Jan 2024 20:35 IST

Google Pay | ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్‌కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్‌ పే (Google Pay) నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)కు చెందిన ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ వెలుపలా యూపీఐ సేవల్ని అందించటంలో భాగంగా గూగుల్‌పే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇతర దేశాలకు వెళ్లే వారికి నగదు తీసుకెళ్లటం, ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఛార్జీల భారం తగ్గనుంది.

ఇతర దేశాల్లోను సులువుగా యూపీఐ చెల్లింపులు జరపాలన్న ఉద్ధేశంతో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గూగుల్‌ పే తెలిపింది.  ఇందులో మూడు కీలకాంశాలు పేర్కొంది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా భారత్ వెలుపలా లావాదేవీలు నిర్వహించటం మొదటిది కాగా, ఇతర దేశాల్లో యూపీఐ వంటి డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయడంలో సాయపడటం రెండోది. చివరగా వివిధ దేశాల మధ్య చెల్లింపుల ప్రక్రియ సులభతరం చేయడం ఈ ఒప్పందం ఉద్దేశం అని గూగుల్‌ పే ఓ ప్రకటనలో తెలిపింది.

ఇకపై డిజిటల్‌ చెల్లింపులు చేయడానికి విదేశీ కరెన్సీ, ఫారెక్స్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, గూగుల్‌పే ద్వారా భారత్‌ వెలుపలా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఎన్‌పీసీఎల్‌  పేర్కొంది. ఈ అవగాహన ఒప్పందం యూపీఐ ఉనికిని బలోపేతం చేస్తుందని ఎన్‌పీసీఎల్‌ సీఈఓ రితేష్‌ శుక్లా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని