HDFC: హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేటు 5 బేసిస్‌ పాయింట్ల పెంపు

గృహ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ప్రామాణిక రుణ రేటును 5 బేసిస్‌ పాయింట్లు (0.05 శాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది....

Published : 01 Jun 2022 21:33 IST

దిల్లీ: గృహ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ప్రామాణిక రుణ రేటును 5 బేసిస్‌ పాయింట్లు (0.05 శాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాలు (EMI) భారం కానున్నాయి. గృహ రుణాలపై రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును (RPLR‌) ఈ రోజు నుంచి 5 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త రుణ గ్రహీతలకు అందించే వడ్డీ రేట్లను వారి క్రెడిట్‌ స్కోరు, రుణం మొత్తాన్ని బట్టి 7.05-7.50 శాతం మధ్య ఉంచింది. గత నెలలోనూ హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేట్లను 35 బేసిస్‌ పాయింట్లు పెంచింది. మే నెలలో ఆర్‌బీఐ రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచిన తర్వాత బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు రుణరేట్లను సవరిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని