Honor 90 5G: 200 ఎంపీ కెమెరా ఫోన్‌తో హానర్‌ రీ ఎంట్రీ.. లాంచ్‌ డేట్‌ ఫిక్స్

Honor 90 5G Ready to launch in India: హానర్‌ 90 5జీ హానర్‌ బ్రాండ్‌ భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. సెప్టెంబర్‌ 14న కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.

Updated : 07 Sep 2023 15:39 IST

Honor 90 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: హానర్‌ బ్రాండ్‌ మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది. త్వరలో ఓ కొత్త ఫోన్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 14న హానర్‌ 90 5జీ ఫోన్‌ను (Honor 90 5G) ఆ కంపెనీ లాంచ్‌ చేయనుంది. ఈ మేరకు హెచ్‌టెక్‌ (HTech) కంపెనీ ఎక్స్‌ (ట్విటర్) ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 200 ఎంపీ కెమెరాతో వస్తుండడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. హానర్‌ 90 5జీ ఫోన్‌ ఇప్పటికే చైనాలో లాంచ్‌ అయ్యింది.

హానర్‌ 90 5జీ లాంచ్‌కు సంబంధించి సెప్టెంబర్‌ 14న ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. ఇందులో 1.5K రిజల్యూషన్‌ కలిగిన టీయూవీఎ రైన్‌ల్యాండ్ సర్టిఫైడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లోనూ డిస్‌ప్లేనే ప్రధానంగా కంపెనీ హైలైట్‌ చేస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత మేజిక్‌ ఓఎస్‌ 7.1తో ఈ ఫోన్‌ వస్తోంది. వెనుక వైపు 200 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు, ముందు వైపు 50 ఎంపీ కెమెరా ఇస్తున్నారు.

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పెంపు.. కొత్త డెడ్‌లైన్‌ ఇదే..!

హానర్ 90 5జీ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 66W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో ఈ ఫోన్‌ వస్తున్నట్లు తెలిసింది. ఫోన్‌ ధర విషయానికొస్తే రూ.35 వేలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, ధర, ఇతర వివరాలు లాంచింగ్‌ రోజు తెలుస్తాయి. 2020 నుంచి హానర్‌ బ్రాండ్ ఫోన్లు భారత్‌లో విక్రయించడం లేదు. ఇటీవల రియల్‌మీ వైస్‌ప్రెసిడెంట్‌ మాధవ్‌సేత్‌ రియల్‌మీకి గుడ్‌బై చెప్పి హానర్‌లో చేరారు. ఆయన నేతృత్వంలో హానర్‌ తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని