పెట్టుబడి పత్రాలు పోయినా, ఆస్తిని పొందడం ఎలా?

క్లెయిమ్ చేసుకోని నిధుల వివరాలను తమ వెబ్సైట్ లో అప్డేట్ చేయాలని బీమా సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది​​​​​​....​

Published : 21 Dec 2020 13:13 IST

క్లెయిమ్ చేసుకోని నిధుల వివరాలను తమ వెబ్సైట్ లో అప్డేట్ చేయాలని బీమా సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది​​​​​​​

26 జూలై 2018 మధ్యాహ్నం 3:04

పెట్టుబడుల వివరాలను మర్చిపోవడమనేది ఒక పెద్ద సమస్య. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో బ్యాంకులు, బీమా సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. పాత రోజుల్లో పెట్టుబడిదారులు వారు చేసిన పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను పోగొట్టుకోవడం లేదా వాటి వివరాలను మర్చిపోవడం ఎక్కువగా చేసేవారు. ఈ కారణం వలన ఆ డబ్బు ఆర్థిక సంస్థల ఖాతాల్లో ఉండిపోయేది. అటువంటి పెట్టుబడిదారులు వారి వివరాలను, చిరునామాలను సంబంధిత ఆర్థిక సంస్థలలో అప్డేట్ చేయకపోవడం వలన ఆర్థిక సంస్థలు వారిని కనుగొనడంలో విఫలమయ్యారు. అలాగే, అసలు పత్రాలను కోల్పోవడం వలన వాటి ద్వారా వచ్చే మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడం కష్టంగా మారుతుంది. మీరు ఈ కింది విషయాలను అనుసరించడం ద్వారా 10 సంవత్సరాల తర్వాత కూడా మీ డబ్బును తిరిగి పొందవచ్చు:

  1. ఒక ఖాతా 10 సంవత్సరాల పాటు పనిచేయకపోయినా లేదా 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పాటు ఎలాంటి క్లెయిమ్ చేయకపోయినా, అది రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ పథకానికి బదిలీ అవుతుంది.
  1. చాలా కాలం పాటు బ్యాంకును సంప్రదించకపోయినప్పటికీ, ఒక పెట్టుబడిదారుడు డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా తన ఖాతాను వినియోగించుకోవచ్చు.

  2. ఫండుల నుంచి బ్యాంకు డబ్బును క్లెయిమ్ చేసుకుంటుంది.

  1. ఒకవేళ సాంప్రదాయ బీమా పాలసీ మెచ్యూర్ అయిన 10 సంవత్సరాల తరువాత కూడా ఎటువంటి దావా వేయకపోతే, డబ్బు సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ ఫండ్ కు బదిలీ అవుతుంది.

  2. కేవైసీ వివరాలను అందించడం, మీ విశ్వసనీయతను రుజువు చేసుకోవడం ద్వారా రాబోయే 25 సంవత్సరాలలో ఈ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.

కొన్నిసార్లు చనిపోయిన వారి తాతలు లేదా తల్లిదండ్రులు పెట్టిన పెట్టుబడులు, ఆస్తుల వివరాల గురించి నామినీలకు, చట్టపరమైన వారసులకు తెలియపోవడంతో వాటిని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటివి వీలునామా లేని సందర్భంలో మాత్రమే జరుగుతుంటాయి. దీనికి ప్రతిగా ఆర్బీఐ చాలా కాలంగా ఆపరేట్ చేయని, క్రియారహితంగా ఉన్న బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలను వారి వెబ్సైట్లలో పొందుపరచాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే క్లెయిమ్ చేసుకోని నిధుల వివరాలను తమ వెబ్సైట్ లో అప్డేట్ చేయాలని బీమా సంస్థలను కూడా ఆర్బీఐ ఆదేశించింది.

మీ తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో ఆస్తులను సంపాదించి, షేర్లలో పెట్టుబడులు పెట్టి వాటికి నామినీగా మీ పేరును నమోదు చేయకపోతే, అప్పుడు ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీ తల్లిదండ్రులకు చట్టపరమైన వారసులు మీరేనని రుజువు చేయడానికి జిల్లా న్యాయస్థానం నుంచి వారసత్వ సర్టిఫికేట్ ను పొందవలసి ఉంటుంది. కానీ ఇది అంత సులువైన విషయం కాకపోవచ్చు. దీని కోసం మీరు ఆస్తి రికవరీ కంపెనీల సహాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో చట్టపరమైన క్లెయిమ్స్ ను దాఖలు చేయడం, పెట్టుబడులను వెతకడం, సంబంధిత కంపెనీలను సంప్రదించడం వంటివి ఉంటాయి. ఒకవేళ మీ తల్లిదండ్రులు వారి బ్యాంక్ ఖాతాకు మిమల్ని నామినీనిగా నియమించకుండానే మృతి చెందిన పరిస్థితిలో, మీరు వారసత్వపు సర్టిఫికేట్ లేదా చట్టపరమైన వారసుల సర్టిఫికేట్ ను సమర్పించాలి. అలాగే చట్టపరమైన వారసుడి కేవైసీ వివరాలతో పాటు ఇతర చట్టపరమైన వారసుల నుంచి ఎన్ఓసీ పత్రాలను అందించవలసి ఉంటుంది.

ఒక పెట్టుబడిదారుడు అతని షేర్ సర్టిఫికేట్ ను పోగొట్టుకుని, హోల్డింగ్ ల ఫోలియో సంఖ్యను కూడా మర్చిపోయినట్లైతే, అప్పుడు అతను నేరుగా సంస్థను సందర్శించాల్సి ఉంటుంది. వారికి మీ వ్యక్తిగత వివరాలను ఒక పేపర్ మీద రాసి దానితో పాటు మీ కేవైసీ డాక్యుమెంట్లను కూడా అందజేయాల్సి ఉంటుంది. సంస్థ దరఖాస్తుదారుని విశ్వసనీయతను పరిశీలించి, హోల్డింగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని