Indigo AI chatbot: ఇండిగో నుంచి ఏఐ చాట్‌బాట్.. తెలుగులోనూ సేవలు

Indigo AI Chatbot: ఇండిగో సంస్థ AI చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. తెలుగు సహా వివిధ భాషల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

Published : 27 Nov 2023 18:07 IST

Indigo AI chatbot | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ విమాయాన సంస్థ ఇండిగో (Indigo) 6Eskai పేరిట ఏఐ చాట్‌బాట్‌ (Indigo AI chatbot) సేవలను ప్రారంభించింది. టికెట్ల బుకింగ్‌ సహా కస్టమర్లు అడిగే ప్రశ్నలకు ఈ చాట్‌బాట్‌ పది భాషల్లో సమాధానం ఇస్తుంది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ ఏఐ చాట్‌బాట్‌ స్పందిస్తుంది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఇండిగో డిజిటల్‌ టీమ్‌ ఈ కొత్త ఏఐ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. జీపీటీ-4 టెక్నాలజీని ఇందులో వినియోగించారు.

ఈ చాట్‌బాట్‌ వల్ల కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్లపై 75 శాతం వరకు పనిభారం తగ్గుతుందని ఇండిగో తెలిపింది. కస్టమర్లు తరచూ అడిగే వివిధ రకాల ప్రశ్నలకు ఈ చాట్‌బాట్‌ సమాధానం ఇస్తుందని పేర్కొంది. విమాన టికెట్‌ బుకింగ్‌, వెబ్‌చెక్‌-ఇన్‌, సీట్‌ సెలక్షన్‌, ఇటిర్నరీ డౌన్‌లోడ్‌, జర్నీ లేదా ట్రిప్‌ ప్లానింగ్‌ వంటి సేవలను ఈ ఏఐ చాట్‌బాట్‌ అందిస్తుంది. డిస్కౌంట్‌ కూపన్ల వినియోగంలోనూ ఏఐ చాట్‌బాట్‌ సహాయపడుతుంది. టెక్ట్స్‌ మాత్రమే కాకుండా స్పీచ్‌ ఆప్షన్‌ ద్వారా మనం ఇచ్చే కమాండ్లకు టెక్ట్స్‌ రూపంలో ఈ ఏఐ చాట్‌బాట్‌ సమాధానం ఇస్తుంది.

ఆర్‌బీఐ నిబంధనలు కఠినతరం.. పర్సనల్‌ లోన్‌ పొందడం ఇప్పుడెలా?

కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడం కోసం దీన్ని ప్రారంభించామని, దీనివల్ల బుకింగ్‌ ప్రక్రియ మరింత సరళతరం కానుందని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే కాకుండా.. సంభాషణల మధ్యలో మనిషిలానే భావోద్వేగాలను సైతం ఈ ఏఐ చాట్‌బాట్‌ జోడిస్తుందని తెలిపింది. ఈ సేవల పట్ల వినియోగదారులు సంతృప్తి చెందుతారని ఆశాభావం వ్యక్తంచేసింది. దీనికితోడు తమ నిర్వహణ సామర్థ్యం సైతం మెరుగుపడుతుందని ఇండిగో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని